మహాభారత్ కర్ణుడు.. నటుడు పంకజ్ ధీర్ మృతి

హాభారత్​ ఫేమ్​.. ప్రముఖ నటుడు పంకజ్ ధీర్ (68) కన్నుమూశారు. గతకొంత కాలంగా క్యాన్సర్​తో బాధపడుతున్న పంకజ్​.. బుధవారం( 2025 అక్టోబర్​15) తుది శ్వాస విడిచారు.


సక్సెస్​ ఫుల్​ఎపిక్​ పీరియాడికల్ డ్రామా షో మహాభారతంలో ‘కర్ణ’ పాత్ర పోషించి ప్రసిద్ధి చెందారు పంకజ్.

తన నటనా జీవితంలో పంకజ్ ధీర్ అనేక టెలివిజన్ కార్యక్రమాలు ,సినిమాలు రెండింటిలోనూ నటించి విమర్శకుల ప్రశంసలు పొందారు. పంకజ్​ నటించిన బిఆర్ చోప్రా ‘మహాభారత్’, ‘సద్దా ముఖద్దర్’, ‘ఇక్కే పే ఇక్కా’ ప్రజాదరణ పొందాయి. నటుడు అర్జున్ ఫిరోజ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో నటుడు పంకజ్ ధీర్ మృతి పట్ల తన బాధను వ్యక్తం చేశారు. జెంటిల్‌మన్ వీడ్కోలు ..మిమ్మల్ని మిస్ అవుతున్నామంటూ రాశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.