మీ ఇంటికి పేదరికం తీసుకొచ్చే మొక్కలు ఇవే.. వెంటనే తీసేయండి

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో ఎట్టిపరిస్థితుల్లో చింత చెట్టు మొక్కను పెంచుకోకూడదంట. ఇంటి వద్ద కానీ, ఇంటి పరిసరాల్లో చింత పండు మొక్కను పెంచుకోవడం వలన ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.


చాలా మంది తమ ఇంటిలోపల గోరింటాకు మొక్కను పెంచుకుంటారు. కానీ ఎట్టిపరిస్థితుల్లో ఇంటి వద్ద గోరింటాకు మొక్కను పెంచుకోకూడదంట. గోరింటాకు మొక్కపైన దుష్టశక్తులు నివసిస్తాయని అంటుంటారు. అందువలన ఈ మొక్క ఇంటి దగ్గర పెంచుకోవడం వలన ప్రతి కూల శక్తులు ప్రభావంతో పేదరికం వస్తుందంట.

వాస్తు ప్రకారం, ఇంటిలోపల ఎట్టిపరిస్థితుల్లోనూ ఎండిన మొక్కలు ఉండకూడదంట. ఎండిపోయిన మొక్కలను ఇంటిలోపల ఉంచడం వలన ఇవి నెగిటివ్ ఎనర్జీనీ తీసుకొస్తాయి. దీంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు, విభేదాల వంటివి తలెత్తుతాయంట.

ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పరిసరాల్లో నల్ల తుమ్మ చెట్టును పెంచుకోకూడదంట. దీనిని ఇంటి పరిసరాల్లో పెంచుకోవడం వలన కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఎక్కువై, చాలా సమస్యలు వస్తాయని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ నాలుగు రకాల మొక్కలు ఎట్టి పరిస్తితుల్లో ఇంటి వద్ద ఉండకూడదు, ఒక వేళ ఉంటే వెంటనే తీసి వెయ్యాలని సూచిస్తున్నారు నిపుణులు.

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.