దీపావళి స్పెషల్.. ఓటీటీ ప్రియులకు కాస్తా ముందుగానే

చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. దీనికి తోడు వచ్చే సోమవారమే దీపావళి పండుగ. ఇంకేముంది వరుసగా మూడు రోజులు సెలవులు కూడా వచ్చేస్తున్నాయి. ఈ వారాంతానికి తోడు దీపావళి కలిసి రావడంతో ఫ్యామిలీతో చిల్ అయ్యేందుకు సినీ ప్రియులు సిద్ధమైపోయారు.


మీ కోసమే ఈ వారంలో మిత్రమండలి, తెలుసుకదా, డ్యూడ్, కె ర్యాంప్ లాంటి థియేటర్లకు వరుసగా క్యూ కడుతున్నాయి.

అదే సమయంలో థియేటర్లలో వెళ్లలేని వారు ఓటీటీ చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫ్రైడే ఏయే సినిమాలు డిజిటల్‌గా స్ట్రీమింగ్ కానున్నాయోనని తెగ వెతికేస్తున్నారు. అలాంటి వారి కోసం రెండు టాలీవుడ్ మూవీస్ శుక్రవారం స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. మంచు లక్ష్మీ దక్ష, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కంధపురి ఇంట్రెస్టింగ్‌ ఉన్నాయి. వీటితో పాటు ఆనందలహరి అనే వెబ్ సిరీస్ కూడా సందడి చేయనుంది. అంతేకాకుండా పలు బాలీవుడ్, హాలీవుడ్‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లు శుక్రవారమే ఓటీటీలో అలరించనున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు కూడా ఓ లుక్కేసేయండి.

ఓటీటీల్లో ఫ్రైడే మూవీస్

నెట్‌ఫ్లిక్స్

27 నైట్స్ (స్పానిష్ మూవీ) – అక్టోబర్ 17

గుడ్ న్యూస్ (కొరియన్ సినిమా) – అక్టోబర్ 17

గ్రేటర్ కాలేష్ (హిందీ సిరీస్) – అక్టోబర్ 17

షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్ (స్పానిష్ సినిమా) – అక్టోబర్ 17

ద ఫెర్‌ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ చిత్రం) – అక్టోబర్ 17

టర్న్ ఆఫ్‌ ది టైడ్- సీజన్ 2- (హాలీవుడ్ సిరీస్)- అక్టోబర్ 17

ది డిప్లొమాట్- సీజన్ 3- అక్టోబర్ 17

హౌటూ ట్రైన్‌ యువర్ డ్రాగన్(యానిమేషన్ మూవీ)- అక్టోబర్ 18

అమెజాన్ ప్రైమ్

దక్ష(తెలుగు సినిమా)- అక్టోబరు 17

హాలీవుడ్ హస్లర్- గ్లిట్జ్, గ్లామ్, స్కామ్(డాక్యుమెంటరీ సిరీస్)- అక్టోబరు 17

ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్‌ లైన్స్- అక్టోబర్ 18

జియో హాట్‌స్టార్

ఘోస్ట్స్‌ సీజన్-5(హాలీవుడ్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 17

ఆహా

ఆనందలహరి (తెలుగు వెబ్ సిరీస్) – అక్టోబరు 17

జీ5

కిష్కింధపురి (తెలుగు సినిమా) – అక్టోబరు 17

భగవాన్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ మూవీ) – అక్టోబరు 17

ఎలుమలే (కన్నడ సినిమా) – అక్టోబరు 17

మేడమ్ సేన్ గుప్తా (బెంగాలీ మూవీ) – అక్టోబరు 17

అభయంతర కుట్టవాళి (మలయాళ సినిమా) – అక్టోబరు 17

సన్ నెక్స్ట్

ఇంబమ్ (మలయాళ మూవీ) – అక్టోబరు 17

మట్టా కుతిరై(మలయాల సినిమా)- అక్టోబర్ 19

లయన్స్ గేట్ ప్లే

సంతోష్ (హిందీ సినిమా) – అక్టోబరు 17

వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబరు 17

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.