ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు? కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వరుసగా భారీ వరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు శాతం డీఏ పెంచడంతోపాటు ఈపీఎఫ్‌ఓలో ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది.


జీఎస్టీ శ్లాబుల మార్పుతో కూడా ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించింది. ఇదిలా ఉండగా రిటైర్మెంట్‌ వయస్సు 62 నుంచి 65 ఏళ్లకు పెంచబోతున్నారని చర్చ జరగడంతో ఒక్కసారిగా ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందాయి. పదవీ విరమణ వయస్సు పెంచుతున్నారని చర్చ జరగడం కలకలం రేపింది. దీనిపై చర్చ కొనసాగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) స్పష్టత ఇచ్చింది.

పదవీ విరమణ వయస్సు పెంపుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు మార్చే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని ఇటీవల కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ప్రకటించారు. అయినా కూడా రిటైర్మెంట్‌ వయస్సు పెంపుపై అసత్య ప్రచారం కొనసాగుతుండడంతో పీఐబీ స్పందించింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఓ జీవో ప్రత్యక్షమైంది. ఆ జీవో సోషల్‌ మీడియాలో తిరుగుతుండడంతో ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే పీఐబీ ప్రకటన విడుదల చేసింది. ఆ జీవో తప్పు అని ఫ్యాక్ట్‌ చెక్ కేంద్ర ప్రభుత్వం అని ప్రకటించింది.

‘జీవో నెం.1575లో పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచుతున్నట్లు ఉంది. వాస్తవానికి జీవో నెం.1545 ప్రకారం ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 పెంచింది’ అని పీఐబీ వివరణ ఇచ్చింది. కొందరు తప్పుడు జీవోను సోషల్‌ మీడియాలో తిప్పుతున్నారని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచేందుకు కొత్త విధానం తీసుకువచ్చిందని ప్రచారం జరుగుతోంది.

సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం మొత్తం అవాస్తవాలేనని పీఐబీ ప్రకటించింది. ఈ విషయాన్ని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. రిటైర్మెంట్‌ వయసును పెంచే.. సవరించే నిర్ణయం ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిపై ఏదైనా సమాచారం.. నిర్ణయం ఉంటే అధికారిక ప్రకటన ద్వారా సమాచారం అందుతుందని పీఐబీ స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ వయస్సు ఎంత ఉందో తెలుసా? 60 ఏళ్లు నిండిన ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.