ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ (ఐసీపీఎస్), ఎస్ఏఏ, చిల్డ్రన్ హోమ్స్‌లో కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ పద్ధతిపై పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారిణి షేక్ రుక్సానా సుల్తానా బేగం తెలిపారు.
అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, పార్ట్ టైమ్ డాక్టర్, చౌకీదారు కం నైట్ వాచ్ విమెన్, ఎడ్యుకేటర్ పార్ట్ టైం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ పార్ట్ టైం, పీటీ ఇన్స్ట్రక్చర్ కమ్ యోగా టీచర్ పార్ట్ టైం, కుక్, హెల్పర్, హౌస్ కీపర్, హెల్పర్ కమ్ నైట్ వాచ్ విమెన్ పోస్టులకు స్థానిక అర్హులైన 18 – 42 ఏళ్ల వయసున్న మహిళా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయసు సడలింపు ఉంటుందన్నారు. ntr.ap.gov.in నుండి దరఖాస్తులు డౌన్లోడు చేసుకొని పూర్తిచేసిన అన్ని ధ్రువపత్రాల నకళ్లను గజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి దరఖాస్తులను ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం, డోర్ నెంబర్ 6-93, కార్మెల్ చర్చి ఎదురురోడ్, కానూరు, విజయవాడ వారి కార్యాలయానికి అభ్యర్ధులు స్వయంగా సమర్పించాలని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారిణి షేక్ రుక్సానా సుల్తానా బేగం తెలిపారు.
































