టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు సువర్ణావకాశం. ప్రముఖ ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) మరోసారి భారీ ప్రకటన విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 162 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు నవంబర్ 4 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి మీకోసం ప్రత్యేకంగా..
మొత్తం పోస్టులు..
162
ఖాళీల వివరాలు..
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ: 80 పోస్టులు
టెక్నీషియన్-సీ: 82 పోస్టులు
విభాగాల వారీగా అవకాశాలు..
- ఎలక్ట్రానిక్స్
- మెకానికల్
- ఎలక్ట్రికల్
- సివిల్
- ఫిట్టర్
- ఎలక్ట్రానిక్ మెకానిక్
ఈ విభాగాల్లో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
విద్యార్హత..
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ: సంబంధిత విభాగంలో డిప్లొమా పాస్ అయి ఉండాలి.
టెక్నీషియన్-సీ: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ (ITI) లేదా ఇంటర్ వృత్తి విద్య పాస్ అయి ఉండాలి.
అదనంగా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ లేదా సంబంధిత టెక్నికల్ ఫీల్డ్‌లో పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులు.
వయస్సు పరిమితి..
2025 అక్టోబర్ 1 నాటికి అభ్యర్థి వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయస్సులో సడలింపులు..
OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
దివ్యాంగులకు: 10 సంవత్సరాల సడలింపు లభిస్తుంది.
వేతన వివరాలు..
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ: రూ.24,500 – రూ.90,000
టెక్నీషియన్-సీ: రూ.21,500 – రూ.82,000
అదనంగా గ్రేడ్ పే, డీఏ, హెచ్ఆరేఏ, పీఎఫ్, గ్రాట్యుటీ వంటి ఇతర ప్రభుత్వ సౌకర్యాలు కూడా లభిస్తాయి.
ఎంపిక విధానం..
ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ఆధారంగా ఉంటుంది. పరీక్షలో సాధారణ జ్ఞానం, టెక్నికల్ సబ్జెక్ట్ ప్రశ్నలు ఉంటాయి. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. తుది ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు వివరాలు..
ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు..
రూ.590 (General/OBC అభ్యర్థులకు)
SC/ST మరియు దివ్యాంగ అభ్యర్థులకు: ఎలాంటి ఫీజు లేదు.
పరీక్షా కేంద్రాలు..
BEL CBT పరీక్ష దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో నిర్వహించబడుతుంది – హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పుణే వంటి నగరాలు పరీక్షా కేంద్రాలుగా ఉంటాయి. అభ్యర్థులు తమకు అనుకూలమైన నగరాన్ని దరఖాస్తు సమయంలో ఎంపిక చేసుకోవచ్చు.
ఎంపికైన వారికి లభించే ఇతర ప్రయోజనాలు..
ఉచిత వైద్య సౌకర్యాలు
కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్
కంపెనీ క్వార్టర్స్ లేదా హౌస్ రెంట్ అలవెన్స్
వార్షిక బోనస్‌లు, లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA)
సంస్థలో ప్రొమోషన్ అవకాశాలు
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్: www.bel-india.in ను సంప్రదించాలి. దరఖాస్తు ఫారమ్ సబ్మిట్ చేసే ముందు వివరాలు సరిచూసుకోవాలి. ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయడం తప్పనిసరి.
































