నెలరోజుల పాటు అన్నం తినకుంటే ఏం జరుగుతుంది?

హజంగా భారతదేశంలో అన్నాన్ని ఇష్టంగా తినే రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. మనదేశంలో చాలావరకు చాలా రాష్ట్రాలలో ప్రధాన ఆహారం అన్నమే. అయితే అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని చెబుతారు.


ఇది మన శరీరానికి కావలసిన త్వరిత శక్తిని, సంతృప్తి భావనను కలుగజేస్తుంది.

అన్నం తినకుంటే నెలరోజుల్లో ఏం జరుగుతుంది

ఇటీవల కాలంలో ఊబకాయుల సంఖ్య పెరుగుతుండడం, అన్నం తినడం వల్ల ఇతరత్రా అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడం, డయాబెటిస్ వంటివి కంట్రోల్లోకి రాకపోవడం వంటి కారణాలు వెరసి అన్నానికి బదులుగా జొన్న రొట్టె, చపాతి, లేదా తృణధాన్యాలతో చేసిన ఆహారాన్ని తినాలని సలహా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నెలరోజుల పాటు అన్నం తినకపోతే అసలు మనమే శరీరంలో ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

నెలరోజులు అన్నం తినకుంటే మేలు జరుగుతుందా

నెలరోజుల పాటు అన్నం తినకుండా ఉంటే శరీరానికి పూర్తిగా మేలు జరుగుతుంది అని చెప్పలేం. ఎందుకంటే అన్నం లో పోషకాలు తప్పనిసరిగా ఉంటాయి. శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. శరీరానికి కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం కాబట్టి అన్నం తినకపోతే శరీరానికి పూర్తిగా మేలు జరుగుతుంది అని చెప్పలేము. అయితే నెలరోజులు అన్నం తినకపోతే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

అన్నం తినకుంటే బరువుకు చెక్, బ్లడ్ షుగర్ కంట్రోల్

అన్నంలో కేలరీలు ఎక్కువగా ఉండడంవల్ల అన్నాన్ని తినకుండా మానుకున్నప్పుడు క్యాలరీలు తగ్గి బరువు తగ్గుతారు. అన్నాన్ని ఒక నెలరోజుల పాటు తినకుండా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండే అవకాశం ఉంటుంది. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అన్నం మానేస్తే బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది.

అన్నం తినకుంటే ఈ సమస్య కూడా

నెల రోజులపాటు అన్నం తినకపోతే మన శరీరంలో శక్తి క్షీణిస్తుంది. నీరసంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు శక్తి రావాలంటే కార్బోహైడ్రేట్లు ప్రధాన వనరు. అటువంటి కార్బోహైడ్రేట్లను తీసుకోకపోతే నీరసించి పోవడం ఖాయం. అన్నం మానేస్తే మన శరీరానికి కావలసిన తగినంత పోషకాలు అందకపోవచ్చు. దీనికి బదులుగా అన్నం నుండి వచ్చే క్యాలరీలను భర్తీ చేసే ఇతర ధాన్యాలను, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకుంటే చాలా మంచిది.

అన్నానికి బదులుగా ఇవి తినండి

అన్నం పూర్తిగా మానేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోవచ్చు. కనుక నెలరోజుల పాటు అన్నం మానేయాలి అనుకునేవారు అన్నానికి బదులుగా తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పప్పులు వంటివి తినాలి. అవి మీ శరీరానికి అవసరమైన పోషకాలను కచ్చితంగా అందిస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.