టీడీపీలో విషాదం.. కీలక నేత కన్నుమూత!

టీడీపీ సీనియర్ నాయకులు(tdp-leader), ఏపీ ఆగ్రోస్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు(Malepati Subbanaidu) కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ తో పది రోజులుగా విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2025 ఆక్టోబర్ 20వ తేదీ సోమవారం తెల్లవారుజూమున తుదిశ్వాస విడిచారు.


నెల్లూరు జిల్లా దగదర్తిలో ఈరోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. సుబ్బానాయుడు మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటుగా టీడీపీ నాయకులు సంతాపం తెలిపారు. కాగా మాలేపాటి కావలి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి, గిరిజనుల సమస్యలపై పోరాడటానికి కృషి చేశారు. కూటమి ప్రభుత్వం 2024లో ఆయనను ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APAGROS) ఛైర్మన్ గా నియమించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.