జియో దీపావళి ఆఫర్.. ప్లాన్లపై ‘అన్‌లిమిటెడ్‌’ ప్రయోజనాలు

దీపావళి పండుగను పురస్కరించుకుని, రిలయన్స్ జియో ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ (Reliance Jio Diwali 2025 offer)లో భాగంగా జియో యూజర్లు అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 5జీ డేటా, జియో సినిమా, జియో హాట్‌స్టార్, జియోహోమ్ ట్రయల్స్ వంటి సేవలను ఆస్వాదించవచ్చు.


అర్హత కలిగిన ప్లాన్లపై జియో గోల్డ్ క్రెడిట్ కూడా కంపెనీ ఇస్తోంది.

ఆఫర్ వివరాలు
మైజియో యాప్‌తో పాటు జియో వెబ్‌సైట్‌లోనూ కొన్ని ప్రీపెయిడ్‌ ప్లాన్‌లకు “ఫెస్టివల్ ఆఫర్: గోల్డ్ + హోమ్ ట్రయల్” పేరుతో దీపావళి సందర్భంగా బెనిఫిట్లు ప్రకటించింది. వీటిలో స్వల్ప వ్యాలిడిటీతో దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్‌లు ఉన్నాయి. పైన చెప్పినట్లుగా, ఈ ఆఫర్ లో జియో 5జీ నెట్ వర్క్ యాక్సెస్‌, బండిల్ చేసిన ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు, జియో రివార్డ్స్ ఎకోసిస్టమ్ లో ఉపయోగించగల అదనపు జియో గోల్డ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ ఫెస్టివల్ ప్లాన్‌లు ఇప్పటికే ఉన్నవారితోపాటు కొత్త ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి.

ఫెస్టివల్ ఆఫర్ కింద ఉన్న ప్లాన్లు ఇవే..

జియో రూ.349 ప్లాన్: 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, జియో గోల్డ్ బోనస్, జియోహోమ్ ట్రయల్, ఓటీటీ బండిల్ ఉన్నాయి.

జియో రూ.899 ప్లాన్: 90 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ, మొత్తంగా 20 జీబీ అదనపు డేటా.

జియో రూ.999 ప్లాన్: 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2 జీబీ డేటా, జియో గోల్డ్ బోనస్, జియోహోమ్ ట్రయల్, ఓటీటీ బండిల్ ఉన్నాయి.

జియో రూ.3,599 ప్లాన్: 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2.5 జీబీ డేటా.

జియో రూ.100 యాడ్-ఆన్: 30 రోజుల వ్యాలిడిటీ, 5 జీబీ నాన్-డైలీ డేటా. అయితే బేస్ ప్లాన్ వ్యాలిడిటీపై ఎలాంటి ప్రభావం ఉండదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.