రోజు చపాతీలు తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా.

పాతీలు చాలా మంది ఇష్టపడతారు. రాత్రి సమయంలో భోజనం మానేసి చపాతీ తినేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దీని ద్వారా బరువు నియంత్రణతో పాటుగా ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.


అయితే, రోజూ చపాతీలు తినటం ఆరోగ్యరమేనా అనే చర్చ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. దీంతో.. చపాతీలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ఎవరికి సమస్యలు వస్తాయనే అంశం పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

చపాతీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పరిశోధనల ప్రకారం చపాతీలు గుండె ఆరోగ్యానికి ప్రయోజన కరంగా గుర్తించారు. బరువు తగ్గడానికీ చపాతీలు మంచి ఆహారం అని నిపుణులు అంటున్నారు. రోజూ రెండు సాధారణ సైజు చపాతీలను తినడం వల్ల ఇందులో ఉండే అధిక పీచు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుందని వివరించారు. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కృషి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు నిపుణుల సలహా మేరకు రోజూ చపాతీని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. చపాతీని పోషకాల సమ్మేళనంగా చెబుతారు.ఇందులో బి, ఇ విటమిన్లతో పాటు క్యాల్షియం, జింక్‌, కాపర్‌, అయొడిన్‌, మాంగనీస్‌, సిలికాన్‌, పొటాషియం.. వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.

చపాతీల్లో ఉండే అధిక ఐరన్‌ స్థాయులు శరీరంలో హెమోగ్లోబిన్‌ స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయని నిపుణులు వెల్లడించారు. ఫలితంగా రక్తహీనత తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు. చపాతీలో ఉండే సెలీనియం క్యాన్సర్‌ కారకాలు శరీరంపై దాడి చేయకుండా కాపాడుతాయని వివరించారు. కాగా, చపాతీ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువ నూనె, నెయ్యితో చేసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు చేరతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముడిగోధుమలు తీసుకొని స్వయంగా పట్టించుకొని ఆ పిండితో చపాతీ చేసుకుంటే మంచిది. గోధుమపిండికి రాగి, సోయాబీన్‌, చిరుధాన్యాలతో చేసిన పిండిని కూడా కలుపుకొని చపాతీ తయారుచేసుకోవచ్చని చెబుతున్నారు. లేదంటే బయట దొరికే మల్టీగ్రెయిన్‌ పిండిని వాడుకోవాలని సూచిస్తున్నారు. కాగా, చపాతీలను పరిమితంగా తీసుకున్న వరకు సమస్య ఉండదని.. దాటితే మాత్రం సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.