ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ టాబ్లెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.
ఈ సేల్‌లో Samsung, Vivo, Oppo, Nothing వంటి అనేక స్మార్ట్‌ఫోన్ కంపెనీల ఫోన్‌లు సరసమైన ధరకు అందుబాటులో ఉన్నాయి. 20,000 రూపాయల కంటే తక్కువ ధరకు వీటిని కొనుగోలు చేయచ్చు. Vivo T4x 5Gపై అతిపెద్ద డిస్కౌంట్ లభిస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Vivo T4x 5G
ఒకప్పుడు రూ.17,999 ధరకు లభించిన Vivo T4x 5G ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.13,499 మాత్రమే. ఈ ఫోన్‌లో 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల స్క్రీన్ ఉంది. 6500mAh బ్యాటరీ కూడా ఉంది. దీని మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంది. డైమెన్సిటీ 7300 5G చిప్‌సెట్ ప్రాసెసర్ అందించారు.
Realme P3x 5G
డీల్‌లో Realme P3x 5Gని రూ.10,249కి కొనుగోలు చేయచ్చు. ఫోన్ ప్రారంభ ధర రూ.16,999. ఫోన్‌లో 6000mAh బ్యాటరీ, 6.72-అంగుళాల డిస్‌ప్లే ఉన్నాయి. దీని మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ ఉంది.
Oppo K13x 5G
కేవలం రూ.12,999కే Oppo K13x 5Gని కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.16,999. ఇందులో 6.67-అంగుళాల HD+ స్క్రీన్ ఉంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీ ఉన్నాయి.
Samsung Galaxy F36 5G
శాంసంగ్ గెలాక్సీ F36 5G ధర మొదట్లో రూ.22,999గా ఉండేది, కానీ ఇప్పుడు రూ.13,999 ధరకు సేల్‌లో అందుబాటులో ఉంది. ఎక్సినోస్ 1380 చిప్‌సెట్ అందించారు. ఇందులో 5000mAh బ్యాటరీ , 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఉన్నాయి. 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది.
































