ఈ కార్డు ఉంటే 70,000లకే తులం బంగారం

దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త శిఖరాలను చేరుతున్నాయి. అక్టోబర్ 20, 2025 నాటికి, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా ₹1,30,525 దాటిపోయింది.


ఈ పెరుగుతున్న ధరల ట్రెండ్‌లో, చాలా మంది పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టనియాడానికి వెనుకాడుతున్నారు.

అయితే, మీ వద్ద ఒక ప్రీమియం క్రెడిట్ కార్డు ఉంటే, ఈ ఖరీదైన బంగారాన్ని కూడా మీరు సులువుగా, తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది! ఆ కార్డు మరేదో కాదు… HDFC బ్యాంక్ ఇన్ఫి క్రెడిట్ కార్డు (HDFC Infinia Credit Card).

బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ తరుణంలో, HDFC ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు బ్యాంక్ ఒక గొప్ప ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా చాకచక్యంగా కొనుగోలు చేస్తే మీరు ఏకంగా 17% వరకు ఆదా చేయవచ్చు. ఇది కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు, పసిడి ధరలు పెరుగుతున్నప్పటికీ మీ పెట్టుబడిని మరింత లాభదాయకంగా మార్చే తెలివైన పద్ధతి.

బంగారు నాణేలను తక్కువ ధరకే కొనుగోలు చేసే విధానం

ముందుగా, మీ HDFC ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్‌తో HDFC SmartBuy పోర్టల్‌లోకి వెళ్లాలి. SmartBuy ద్వారా మీరు Myntra వెబ్‌సైట్‌కు సంబంధించిన వోచర్‌ను కొనుగోలు చేయాలి.ఈ వోచర్ కొనుగోలుపై మీకు దాదాపు 16.66% (సుమారు 17%) వరకు క్యాష్‌బ్యాక్ లేదా డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ట్రిక్ ద్వారా మీరు నెలకు గరిష్టంగా ₹15,000 వరకు పొదుపు చేయవచ్చు.వోచర్ అందిన తర్వాత, మీరు Myntra వెబ్‌సైట్ లేదా యాప్‌కు వెళ్లి, మీకు కావలసిన బంగారు నాణేలను కొనుగోలు చేయండి. చెల్లింపుల సమయంలో మీరు SmartBuy ద్వారా కొనుగోలు చేసిన వోచర్‌ను ఉపయోగించి పేమెంట్ చేయవచ్చు.ఈ విధంగా, మీరు ఖరీదైన బంగారు నాణేలను కొనుగోలు చేసినప్పటికీ, 17% వరకు ఆదా చేయగలుగుతారు. ప్రీమియం కస్టమర్లకు బంగారంలో పెట్టుబడికి ఇది ఒక అద్భుతమైన అవకాశం!

HDFC ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్ అనేది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, లగ్జరీ కార్డులలో ఒకటి. దీనిని ముఖ్యంగా అధిక ఆదాయం కలిగిన కస్టమర్ల కోసం రూపొందించారు.ఈ కార్డుతో ప్రయాణం, ఫుడ్, గోల్ఫ్, షాపింగ్ వంటి విభాగాల్లో అనేక ప్రత్యేక రివార్డులు, ప్రపంచవ్యాప్తంగా లౌంజ్ యాక్సెస్‌లు, ప్రీమియం సర్వీసులు లభిస్తాయి. దీని వార్షిక ఫీజు ₹12,500. అయితే, మీరు ఏడాదిలో ₹10 లక్షల వరకు ఖర్చు చేస్తే, ఈ ఫీజు ఆటోమేటిక్‌గా మాఫీ అవుతుంది.ఇది ఆకర్షణీయమైన మెటల్ ఎడిషన్‌లో కూడా అందుబాటులో ఉంది.

మార్కెట్‌లో అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా ఉంటుంది. దీర్ఘకాల పెట్టుబడికి ఇది మంచి రిటర్న్స్ ఇస్తోంది. పెరుగుతున్న ధరల మధ్య, HDFC ఇన్ఫినియా కార్డు అందించే ఈ స్మార్ట్ ఆఫర్‌ను ఉపయోగించుకుని, మీ బంగారు పెట్టుబడిని తెలివిగా, తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు. ఇది కేవలం పొదుపు మాత్రమే కాదు, అధిక స్థాయి సౌలభ్యాన్ని కూడా కల్పిస్తుంది.

Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని మేము సూచిస్తున్నాము.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.