పాస్‌పోర్ట్ లేకుండా ప్రపంచాన్ని చుట్టొచ్చే ముగ్గురు శక్తివంతులు.. ట్రంప్, మోడీ కాదబ్బా!

వరైనా ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లాలి అంటే పాస్పోర్టు, వీసా తప్పనిసరిగా కావాలి. పాస్పోర్ట్, వీసా లేకుంటే వేరే దేశాలలో ప్రవేశానికి అనుమతి ఉండదు.


అది ప్రధాని మోడీ అయినా, అగ్ర దేశాధినేతను అని చెప్పుకునే డోనాల్డ్ ట్రంప్ అయినా సరే పాస్పోర్ట్ ఉండి తీరాల్సిందే.

పాస్ పోర్ట్, వీసా లేకుండా ప్రపంచంలో తిరగగల ముగ్గురు శక్తివంతులు

ప్రపంచంలోనే చాలా అరుదుగా ముగ్గురు వ్యక్తులకు అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. వారు ఏ దేశానికి ప్రయాణం చేయాలి అన్న పాస్పోర్ట్, వీసా ఉండాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోనే చాలా అరుదుగా పాస్పోర్ట్, వీసా లేకుండా ఏ దేశంలో అయినా ముగ్గురు శక్తివంతులు ఎవరు అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III

బ్రిటన్ ప్రస్తుత రాజు కింగ్ చార్లెస్ III ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి పాస్పోర్ట్ అవసరంలేని శక్తివంతమైన వ్యక్తి. యునైటెడ్ కింగ్ డమ్ లో పాస్ పోర్టులను రాజు పేరుతో జారీ చేస్తారు. వారు దానిని హిస్ మెజెస్టీ పాస్పోర్ట్ అని అంటారు. దీంతో అక్కడ కింగ్ చార్లెస్ III కి పాస్పోర్ట్ అవసరం లేదు అని అర్థం.

వారికి పాస్ పోర్ట్ అవసరం లేదు ఇందుకే

దేశ సార్వభౌమాధికారి ఆయనే కాబట్టి ఆయనకు పాస్పోర్ట్ అవసరం లేదని చెబుతారు. అంతకుముందు క్వీన్ ఎలిజిబెత్ II కాలంలో కూడా ఆమెకు పాస్పోర్ట్ లేదు. 2023 చార్లెస్ III పట్టాభిషేకం తర్వాత ఈ ప్రత్యేక హక్కు మరింత బలపడింది. ఇది బ్రిటన్ రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన ప్రత్యేకమైన సౌకర్యం

జపాన్ సామ్రాట్ ఎంపరర్ నరుహిటో

పాస్పోర్ట్ అవసరంలేని మరో శక్తివంతమైన వ్యక్తి జపాన్ సామ్రాట్ ఎంపరర్ నరుహిటో. ప్రపంచవ్యాప్తంగా పాస్పోర్ట్ లేకుండానే పర్యటించగలిగిన వ్యక్తి. జపాన్ దేశానికి ప్రతీకాత్మక అధినేత అయిన ఆయన అధికారిక పర్యటనలు అన్ని దౌత్య ప్రోటోకాల్ ప్రకారం జరుగుతాయి. వారికి ఎటువంటి పాస్పోర్ట్ అవసరం ఉండదు.

జపాన్ సామ్రాజ్ఞి మసాకోకు నో పాస్ పోర్ట్, వీసా

విదేశాంగ మంత్రిత్వ శాఖ 1971లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జపాన్ సామ్రాట్ కు మరియు ఆయన కుటుంబానికి పాస్పోర్ట్ అవసరం లేదు. ఇక జపాన్ సామ్రాజ్ఞి ఎమ్ప్రెస్ మసాకోకు కూడా జపాన్ సామ్రాట్ కు ఉన్న హక్కే వర్తిస్తుంది. ఆమె కూడా ఎంపరర్ నరుహిటోతో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యటనలు చేస్తుంటారు. వీరి పర్యటనలు రాజ పర్యటనలుగా పరిగణించబడతాయి కావున వీరికి సాధారణ పాస్పోర్ట్ మరియు వీసా అవసరం ఉండవు.

వీరిది అంతర్జాతీయంగా గుర్తించబడిన రాజ్యాధికారం

ప్రపంచవ్యాప్తంగా ఎంతో శక్తివంతులుగా చెప్పుకునే వారు కూడా వీసా, పాస్పోర్ట్ ల తోనే ప్రయాణం చేయవలసి ఉండగా, ఈ ముగ్గురికి మాత్రం ఈ ప్రత్యేక హక్కు ఉంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రాజ్యాధికారం కావడంతో వీరి ప్రయాణాలు వారి దేశాల యొక్క ప్రతిష్టకు ప్రతీకగా పరిగణించబడతాయి కాబట్టి వీరికి అంతర్జాతీయ మర్యాద నియమాల ప్రకారం ఈ ప్రత్యేక హక్కును ఇవ్వడం జరిగింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.