రేపు బ్యాంకులు బంద్.. ఎందుకంటే..?

క్టోబర్ నెల వచ్చిందంటే చాలు, వరుస పండుగలు, జాతీయ సెలవుల కారణంగా బ్యాంకులన్నీ చాలా రోజులు మూసి ఉంటున్నాయి. దీపావళి సంబరాలు ముగిసిన వెంటనే, మరికొన్ని ప్రాంతాల్లో బ్యాంక్ సెలవులు కొనసాగనున్నాయి.


స్థానిక పండుగలు, ఆచారాల ఆధారంగా బ్యాంక్ హాలిడేస్‌ను నిర్ణయించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం, రేపు అక్టోబర్ 22, బుధవారం రోజున కొన్ని కీలక రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉండనున్నాయి.

ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే

బలిపాడ్యమి, లక్ష్మీ పూజ, మరియు విక్రమ్ సంవత్ నూతన సంవత్సర దినోత్సవం వంటి ముఖ్యమైన పండుగల సందర్భంగా కింద పేర్కొన్న రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.గుజరాత్,మహారాష్ట్ర,కర్ణాటక,ఉత్తరాఖండ్,సిక్కిం,రాజస్థాన్,ఉత్తర్ ప్రదేశ్,బిహార్, ఈ రాష్ట్రాల్లోని ప్రజలు తమ బ్యాంక్ లావాదేవీల విషయంలో ముందుగానే ప్రణాళిక వేసుకోవడం మంచిది.

బ్యాంకులకు సెలవు ఉన్నంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆధునిక బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు ఫండ్స్ ట్రాన్స్‌ఫర్, బిల్లు పేమెంట్లు చేసుకోవడానికి ఆన్‌లైన్ సేవలను ఉపయోగించవచ్చు.

ఏటీఎం (ATM) సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, యూపీఐ (UPI) ప్లాట్‌ఫారమ్‌లు ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ ద్వారా ముఖ్యమైన లావాదేవీలు పూర్తి చేయవచ్చు.

అయితే, పెద్ద మొత్తంలో క్యాష్ డిపాజిట్లు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, అకౌంట్ సెటిల్‌మెంట్లు వంటి సేవలు మాత్రం రేపు బ్యాంక్ బ్రాంచ్‌లలో అందుబాటులో ఉండవు. కాబట్టి, చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు, ముఖ్యమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవడం తెలివైన పని. పండుగల మాసం కాబట్టి, బ్యాంక్ హాలిడేస్‌ను చెక్ చేసుకుని జాగ్రత్త పడండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.