ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల DA విడుదలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన GO నంబర్ 60, 61 లలో మార్పులు చేసింది చంద్రబాబు సర్కారు.
ప్రభుత్వ ఉద్యోగులకు నేటి నుంచి ఏడాది లోపు మూడు వాయిదాలలో DA బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ఉద్యోగుల GPF ఖాతాల్లో జమ చేయాలని GO లో సవరణలు తీసుకొచ్చారు. CPS ఉద్యోగులు, పెన్షనర్ లకు ఏడాది లోపు మూడు వాయిదాలలో చెల్లించాలని ఆదేశాలిచ్చారు.
దీనికి సంబంధించి కొంచెంసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం కొత్త GO విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన DA బకాయిలు ఉత్తర్వులను సవరిస్తూ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ GO నంబర్ 62 ను విడుదల చేశారు. తాము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే సవరణ GO ఇచ్చినందుకు APNGO సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
































