నిన్న గాక మొన్న ఉపాసనకు సంబంధించిన రెండవ సీమంతం వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హల్చల్ చేసింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడిచింది.
క్లిన్ కారా పుట్టినప్పుడు అభిమానులు ఏ రేంజ్ లో అయితే సంబరాలు చేసుకున్నారో, ఇప్పుడు రెండవ సీమంతం వార్త విన్నప్పుడు కూడా అదే రేంజ్ లో సంబరాలు చేసుకున్నారు. మరో విశేషం ఏమిటంటే ఉపాసన కి ఈసారి కవలపిల్లలు పుట్టబోతున్నారట. ఇది ఎవ్వరూ ఊహించనిది. రామ్ చరణ్ ‘అన్ స్టాపబుల్’ షో కి వచ్చినప్పుడు ఆయన తల్లి సురేఖ తమకు మగబిడ్డ కావాలని రామ్ చరణ్ ని బాలయ్య సమక్ష్యం లో కోరడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక్కసారి ఊహించుకోండి..పుట్టబోయే కవలపిల్లలు ఇద్దరూ మగబిడ్డలు అయితే ఆమె ఎంత సంతోషిస్తుందో. ఇదంతా పక్కనా పెడితే, ఈ వార్త బయటకు వచ్చిన రెండు రోజులకు ఉపాసన కుటుంబానికి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.
ఉపాసన సోదరి అనుష్పాల కామినేని కూడా కవలపిల్లలకు జన్మనిచ్చింది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు క్లిన్ కారాతో పాటు, అనుష్పాల కుతుమాం తో దిగిన ఒక ఫోటో సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది. అనుష్పాల దంపతుల చేతుల్లో ఆ కవలపిల్లలు ఎంత ముద్దుగున్నరో మీరే చూడండి. అసుష్పలా కామినేని 2021 వ సంవత్సరం లో అమ్రాన్ ఇబ్రహ్మీమ్ అనే అతన్ని ప్రేమించి పెళ్లాడింది. వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ మొత్తం ఆ పెళ్లి వేడుకకు హాజరైంది. చూసేందుకు అప్పట్లో ఈ జంట ఎలా ఉండేదో, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏది ఏమైనా ఒకే సందర్భంలో కుటుంబం నుండి వరుసగా ఇలాంటి శుభాలు కలిగే అదృష్టం ఎంత మందికి వస్తుంది చెప్పండి, దేనికైనా రాసి పెట్టి ఉండాలని పెద్దలు ఇందుకే అంటుంటారు.




































