ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు వాడకం బాగా పెరిగిపోయింది. కొందరు ఒకటికి మించి క్రెడిట్ కార్డులను వినియోగిస్తుంటారు. అయితే మొదట తక్కువ లిమిట్ ఇచ్చినప్పటికీ..
కాలం గడిచే కొద్ది సంస్థలు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతుంటాయి. క్రెడిట్ కార్డు లిమిట్(Credit Card Limit) పెంచడం మంచిదేనా లేకా ఏమైనా ఇబ్బందులు ఎదురువుతాయా అని చాలా మందికి సందేహాలు వ్యక్తమవుతుంటాయి. అయితే కార్డు లిమిట్ పెంచడం లాభమా.. నష్టమా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మార్కెట్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎక్కువ లిమిట్ ఉండే క్రెడిట్ కార్డులు వాడటం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ తగ్గే అవకాశం ఉంది. మీ క్రెడిట్ యుటిలైజేషన్ రేషియోని(CUR)(Credit Utilization Ratio) బట్టి క్రెడిట్ స్కోర్ మారుతుంది. క్రెడిట్ కార్డు పరిమితిలో ఎంత శాతం రుణం వాడుతున్నారన్న దాన్ని బట్టి క్రెడిట్ స్కోర్ పెరగడం లేదా తగ్గడం ఆధార పడి ఉంటుంది. ఈ సీయూఆర్ 30 శాతం ఉంటే స్కోర్ బాగుంటుంది. ఇక చిన్న ఉదాహరణతో మన ఇంకాస్తా బెటర్ గా అర్థం చేసుకోవచ్చు. ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు లిమిట్ రూ.లక్ష ఉంది అనుకుందాం. అయితే అందులో రూ. 30 వేల వరకు వినియోగిస్తే.. సదరు వ్యక్తి సీయూఆర్ స్కోర్ బాగా ఉందని అర్థం.
ఒకవేళ లిమిట్ రూ. లక్షన్నరకుపెరిగితే అప్పుడు రూ.30 వేల కంటే ఎక్కువ ఖర్చు చేయాలి. 30 శాతం క్రెడిట్ సీయూఆర్ ఉండాలంటే మీరు రూ.45 వేలు ఖర్చు చేయాలి. కాబట్టి ఎక్కువ క్రెడిట్ లిమిట్ మీ క్రెడిట్ స్కోర్ ను ప్రభావం చేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ లిమిట్(credit limit risks) పెరిగితే మీ ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. మీ ఖర్చులపై మీకు కంట్రోల్ లేకపోతే అవసరం కంటే ఎక్కువగా ఖర్చు చేయడం లేదా ఖరీదైన వస్తువులు ఈఎంఐలో కొనుగోలు చేయడం వంటివి పెరుగుతాయి. అప్పుడు పెరిగిన క్రెడిట్ పరిమితి మీకు లాభం కంటే నష్టం ఎక్కువ చేసినట్టవుతుంది. ఒకవేళ మీ ఆదాయం పెరిగి మీకు నిజంగా ఎక్కువ ఖర్చులు ఉన్నప్పుడు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నప్పుడు క్రెడిట్ లిమిట్(credit limit) ను పెంచుకోవడం మంచిదే.
































