‘ఆధార్’​ కేంద్రాలకు వెళ్లక్కర్లేదు, కీలక మార్పులు – ఇక నుంచి ఇలా

ధార్ సేవల పైన గుడ్ న్యూస్. ఇక నుంచి ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డు వివరాల అప్‌డేట్‌లో కీలక మార్పు తీసుకొచ్చారు.


ఇకపై పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లకుండానే అప్డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఫీజుల విషయంలోనూ మార్పులు చేసారు. ఇక నుంచి ఆధార్ సేవలను సులభతరం కానున్నాయి.

ఆధార్ సేవలు మరింత సులభతరం చేసేలా మార్పులు జరిగాయి. ఇప్పటికే ఆధార్ నిర్వహణలో పలు మార్పులు వచ్చాయి. యూఐడీఏఐ కసరత్తులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఇక ఆన్ లైన్ లోనే ఇక ఆధార్ లో కావాల్సిన మార్పులు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. ఇక నుంచి ఆధారం కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా బయోమెట్రిక్ ​అథెంటికేషన్​లో కూడా కీలక మార్పులు తీసుకువచ్చారు. ఆధార్ లో కావాల్సిన మార్పులు చేసుకునే విధానంలో కీలక మార్పులు వచ్చాయి. మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్​, చిరునామాను సులభంగా ఆన్ లైన్ లోనే మార్పులు చేసుకునే విధంగా అప్డేట్ జరిగింది. బయోమెట్రిక్​అథెంటికేషన్​లో కూడా కీలక మార్పులు తీసుకువచ్చారు. ఇప్పటి వరకు ఉన్న ఫింగర్​ప్రింట్​, కంటి ఐరిస్ స్కాన్ ఇప్పుడు మరింత ప్రతిభావంతంగా పనిచేసేలా మార్పులు చేశారు.

దీని ద్వారా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తో పాటు కావాల్సిన విధంగా సేవలు ఉపయోగించే సమయంలో సులభంగా, వేగంగా పనులు పూర్తిచేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. ఆధార్ కార్డు దారుల గోప్యత దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంది. గోప్యతను కాపాడే క్రమంలో భాగంగా కార్డులోని 12 అంకెల పూర్తి ఆధార్​నంబర్​కాకుండా చివరి నాలుగు నంబర్​లు మాత్రమే కనిపిస్తాయి. దీని వల్ల యూజర్ల ప్రైవసీ భద్రంగా ఉంటుంది. అదే విధంగా బ్యాకింక్ రంగంలో ముఖ్యమైన ఈ కేవైసీ ప్రక్రియను మరింత సులభంగా మార్చారు. ఫలితంగా కొత్త బ్యాంక్ ఖాతా, మొబైల్​కనెక్షన్​, లేదా ఏదైనా ఆన్ లైన్ సేవలను సులభంగా పొందే అవకాశం కలుగుతుంది. పాన్​, బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కా​ర్డును లింక్​చేసినప్పటి నుంచి ట్యాక్స్​, ఆర్థిక సేవలకు సంబంధించిన మోసాలు నియంత్రణలోకి వచ్చాయి.

ఇక నుంచి బయోమెట్రిక్ వెరిఫికేషన్ లో ​లో భాగంగా ఫేస్​అథెంటికేషన్ ఫీచర్ ను తీసుకు రానుంది. ఇకపై ఆధార్ ​వెరిఫికేషన్​ ఆఫ్ లైన్ లోనూ చేసుకునేలా యూఐడీఏఐ కొత్త ఫీచర్​ను అందు బాటులోకి తీసుకొస్తోంది. దీని వల్ల ఇంటర్​నెట్​సదుపాయం లేకుండానే ఆధార్​ వెరిఫికేషన్ సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా డిజిటల్ ​ఆధార్​ వెల్ వెట్ లా​లా ఉపయోగపడేలా కొత్తగా ఒక యాప్​ను తీసుకురానుంది యూఐడీఏఐ. ఫలితంగా ఆన్​లైన్​, ఆఫ్​లైన్​వెరిఫికేషన్​సులభంగా కావడంతో పాటు యూజర్​వివరాలు భద్రంగా ఉంటాయి. వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచేలా కొత్త ఎన్​క్రిప్షన్​, మల్టీ ఫ్యాక్టర్​ అథెంటికేషన్​ యూఐడీఏఐ ప్రవేశపెట్టనుంది. వీటిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా కసరత్తు వేగవంతం చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.