గత కొంత కాలంగా చూసుకుంటే ఒకపక్క బంగారం, వెండి ధరలు పెరుగుతుంటే.. మరోపక్క స్టాక్ మార్కెట్ సూచీలు కూడా లాభాల్లోనే సాగుతున్నాయి. మరి కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు వీటిలో ఏది ఎంచుకుంటే బెటర్? ఎవరికి ఎలాంటి పెట్టుబడి సూట్ అవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో చాలామందికి ఆర్థిక పరమైన అవగాహన పెరుగుతోంది. చాలామంది నెలవారీ జీతంలో కొంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఈ ఇన్వెస్ట్ మెంట్ ఎందులో పెట్టాలి అన్నదే సమస్య. ప్రస్తుతం పెట్టుబడులు పెట్టడానికి బంగారం, వెండి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్.. ఇలా పలు ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మూడింటిలోనూ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అయితే ఒక్కో దాంట్లో ఒక్కో రకమైన రిస్క్ ఉంటుంది. మీ ఆలోచనా విధానాన్ని బట్టి ఒక్కోక్కరికి ఒక్కోరకమైన పెట్టుబడి విధానం సూట్ అవుతుంది. అది ఎలా చెక్ చేసుకోవాలంటే..
గోల్డ్/సిల్వర్ ఎవరికంటే..
బంగారం, వెండి పెట్టుబడులను ఎప్పుడూ సేఫ్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఇవి స్థిరమైన ఆదాయాన్ని ఇస్తాయి. ప్రపంచవ్యా్ప్తంగా ఉండే పరిస్థితులను బట్టి వీటి ధరలు మారుతుంటాయి. కానీ, లాంగ్ టర్మ్ లో మాత్రం స్థిరమైన పెరుగుదల ఉంటుంది. మీరు సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారైతే బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టొచ్చు. దీనికోసం డిజిలట్ గోల్డ్ లేదా గోల్డ్/సిల్వర్ ఈటీఎఫ్ లను కొనుగోలు చేయొచ్చు.
స్టాక్ మార్కెట్ ఎవరికంటే..
ఇకపోతే స్టాక్ మార్కెట్ అనేది రిస్క్‌తో కూడుకున్నది. కానీ, బంగారం వెండితో పోలిస్తే ఎక్కువ రాబడిని ఇస్తుంది. అయితే ఇది కూడా దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మారుతుంది. కాస్త రిస్క్ తీసుకున్నా పర్లేదు మంచి లాభాలు రావాలి అని అనుకునేవాళ్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా నేరుగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మార్కెట్ బాగుంటే ఇవి సగటున 10 నుంచి 12 శాతం రిటర్న్స్ ఇస్తాయి. అయితే వీటిలో పెట్టుబడి పెట్టేముందు డాక్యుమెంట్లు క్షుణ్ణంగా చదవాలి. మీకు నమ్మకమున్న ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా పాటించాలి.



































