నేటి సాంకేతిక ప్రపంచంలో సమాచారమే శక్తియే కీలకం. ఈ శక్తిని ప్రపంచవ్యాప్తంగా పంచే ప్రధాన ఆయుధం మీడియానే. టెలివిజన్, న్యూస్ పేపర్, రేడియో, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల రూపంలో విస్తరించిన మీడియా రంగం మానవ నాగరికతలో కీలకమైన పాత్ర పోషిస్తోంది.
అయితే ఈ విస్తారమైన రంగంలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు? ప్రపంచాన్ని ప్రభావితం చేసే టాప్ మీడియా సంస్థలు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా తాజా గణాంకాలు వెలువడ్డాయి. 2025 అక్టోబర్ 21 నాటికి అందుబాటులో ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్, ఆదాయ వివరాల ఆధారంగా రూపొందిన జాబితా ప్రకారం, అగ్రస్థానంలో అమెరికాకు చెందిన “కామ్‌కాస్ట్” నిలిచింది.
* అగ్రస్థానం: కామ్‌కాస్ట్ ఆధిపత్యం
1. కామ్‌కాస్ట్ (Comcast): ఫిలడెల్ఫియా (అమెరికా) కేంద్రంగా పనిచేస్తున్న ఈ దిగ్గజం 110.66 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ తో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. NBC News, CNBC, MSNBC, Sky News వంటి ప్రసిద్ధ ఛానళ్లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. టెలికమ్యూనికేషన్ నుంచి డిజిటల్ మీడియా వరకు విస్తరించిన ఈ సంస్థ ప్రపంచ మీడియా రంగంలో అగ్రశ్రేణి శక్తిగా నిలిచింది. ఆదాయం (జూన్ 30, 2025) నాటికి $124.18 బిలియన్లు ఉంది.
2. థామ్సన్ రాయిటర్స్ (Thomson Reuters): టొరంటో (కెనడా) ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ సంస్థ 72.57 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ తో రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా న్యూస్ సర్వీసులు, లీగల్ డేటా, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అందించే ఈ సంస్థ విశ్వసనీయమైన వార్తల సమాహారంగా పేరుగాంచింది.
3. నాస్పర్స్ (Naspers): దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కేంద్రంగా ఉన్న నాస్పర్స్, ఆఫ్రికా నుంచి ప్రపంచ స్థాయి ప్రభావాన్ని చూపిస్తోంది. 53.84 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ తో మూడో స్థానంలో నిలిచింది. డిజిటల్ మీడియా, ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లు, ఈకామర్స్‌లో ఈ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టింది.
*వినోద, వార్తా దిగ్గజాల స్థానాలు
4. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ (Warner Bros Discovery): 50.33 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో నాలుగో స్థానంలో నిలిచిన ఈ సంస్థ హాలీవుడ్లో మల్టీమీడియా కింగ్‌గా ప్రసిద్ధి పొందింది. సినిమాలు, సిరీస్‌లు, న్యూస్, స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
5. ఫాక్స్ కార్పొరేషన్ (Fox Corp): న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఫాక్స్ కార్పొరేషన్ 23.41 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను కలిగి ఉంది. ఫాక్స్ న్యూస్, ఫాక్స్ స్పోర్ట్స్ వంటి ఛానళ్లతో అమెరికా రాజకీయ, క్రీడా రంగాలలో ఈ సంస్థకు విపరీతమైన ప్రాధాన్యం ఉంది.
6. బీసీఈ (BCE Inc.)
ప్రధాన కార్యాలయం: క్యూబిక్, కెనడా
ఆదాయం: 24.41 బిలియన్ డాలర్లు
మార్కెట్ క్యాప్: 31.31 బిలియన్ డాలర్లు
7. రోజర్స్ కమ్యూనికేషన్స్ (Rogers Communications)
ప్రధాన కార్యాలయం: కెనడా
ఆదాయం: 20.80 బిలియన్ డాలర్లు
నికర ఆదాయం: 1.52 బిలియన్ డాలర్లు
మార్కెట్ క్యాప్: 19.97 బిలియన్ డాలర్లు
8. పారా మౌంట్ స్కై డాన్స్ (Paramount Skydance)
ప్రధాన కార్యాలయం: లాస్ ఏంజిల్స్, కాలిఫోర్నియా
ఆదాయం: 28.76 బిలియన్ డాలర్లు
నికర ఆదాయం: -3 బిలియన్ డాలర్లు
మార్కెట్ క్యాప్: 18.10 బిలియన్ డాలర్లు
9. న్యూస్ కార్ప్ (News Corp)
ప్రధాన కార్యాలయం: న్యూయార్క్
ఆదాయం: 8.45 బిలియన్ డాలర్లు
నికర ఆదాయం: 1.18 బిలియన్ డాలర్లు
మార్కెట్ క్యాప్: 16.83 బిలియన్ డాలర్లు
10. ది న్యూయార్క్ టైమ్స్ కంపెనీ (The New York Times Company)
ప్రధాన కార్యాలయం: న్యూయార్క్
ఆదాయం: 2.69 బిలియన్ డాలర్లు
నికర ఆదాయం: 32 మిలియన్ డాలర్లు
మార్కెట్ క్యాప్: 9.19 బిలియన్ డాలర్లు
సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, సమాచార ప్రవాహాన్ని మలిచేది ఇంకా మీడియానే అని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ప్రింట్ నుంచి డిజిటల్ వరకు మార్పు చోటుచేసుకున్నా, ప్రపంచ ప్రజాస్వామ్యానికి కళ్లజోడుగా నిలిచే ఈ మీడియా సంస్థలు తమ అగ్రస్థానం నిలుపుకుంటూ ముందుకు సాగుతున్నాయి.
































