‘మొంథా’ తుపాను (Cyclone ‘Montha’)తో ఆయా జిల్లాల్లో ఇప్పటికే జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. తుపానుతో నష్టపోయిన కుటుంబాలు, మత్స్యకారులకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. ప్రతి కుటుంబానికి బియ్యం 25 కేజీల బియ్యం, మత్స్యకారులకు 50 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటరు మంచినూనె, కేజీ ఉల్లిపాయలు, కేజీ ఆలుగడ్డ, కేజీ చక్కెర పంపిణీకి చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు సివిల్ సప్లైస్ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు అందాయి.
































