కలెక్టర్‌ హోదాలో పాఠశాలకు పూర్వవిద్యార్థిని

తన చదువుకున్న పాఠశాలకు కలెక్టర్‌ హోదాలో అందరిని ఆశ్చర్య పరిచింది ఓ పూర్వ విద్యార్థిని.


ఈరోడ్‌ జిల్లాలోని సత్యమంగళం ప్రాంతానికి చెందిన సెన్నియప్పన్‌ కారు డ్రైవర్‌గా జీవ నం సాగిస్తున్నాడు. అతని భార్య సుబ్బులక్ష్మి ఉంది. వారి కుమార్తె వాన్మతి ఉంది. ఆమె సత్యమంగళంలోని ప్రభుత్వ బాలికల హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో 3 నుంచి 12వ తరగతి వరకు చదువుకుంది.

ఆమె చదువుకునే సమయంలో అప్పటి కలెక్టర్‌ ఉదయచంద్రన్‌ ప్రత్యేక ఆహ్వానితులుగా పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఆ సమయంలో ఆయనకు ఇచ్చిన గౌరవాన్ని చూసి, వాన్మతి తాను కూడా కలెక్టర్‌ కావాలని నిర్ణయించుకుంది. ఆమె పట్టుదలతో చదివి, ఐఏ ఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. ప్రస్తుతం, వాన్మతి మహారాష్ట్రలోని ఒక జిల్లాలో కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఈ పరిస్థితిలో వాన్మతి తన స్వస్థలం సత్యమంగళం ప్రాంతానికి వచ్చింది. ఈ సందర్భంగా ఆమె చదువుకున్న ప్రభుత్వ బాలికల హయ్యర్‌ సె కండరీ స్కూల్‌కు వచ్చింది. ప్రధానోపాధ్యాయు డు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. విద్యార్థులతో మాట్లాడుతూ కలెక్టర్‌ను చూసిన తర్వాత కలెక్టర్‌ కావాలనే ఆశయంతో తాను చదువుకున్నానని చెప్పింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.