నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. రైల్వేలో భారీగా 11,437 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

 రైల్వే ఉద్యోగాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి గుడ్‌ న్యూస్‌ చెప్పింది.


భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి తాజాగా రెండు వరుస నోటిఫికేషన్లు వెలువరించింది. దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రిజియన్లలో మొత్తం 11,437 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) రెండు వేర్వేరు నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. ఇందులో ఆర్‌ఆర్‌బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌ పోస్టులు 8,868 భర్తీ చేయనుంది. అలాగే 2,569 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు మరో నోటిఫికేషన్‌ వెలువరించింది. డిప్లొమా, ఇంటర్‌, డిగ్రీ అర్హతలతో ఈ నియామకాలు చేపట్టనుంది.

ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్‌, అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టుల వివరాలు ఇలా..

ఆర్‌ఆర్‌బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో భర్తీ చేయనున్న 3,058 అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టుల్లో 2,424-కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, 394-అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, 163-జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, 77-ట్రైన్స్ క్లర్క్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు నవంబర్‌ 27, 2025వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇక నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో గ్రాడ్యుయేట్‌ కేటగిరీలో భర్తీ చేయనున్న 5,810 పోస్టుల్లో గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్-161, స్టేషన్ మాస్టర్-615, గూడ్స్ ట్రైన్ మేనేజర్-3,416, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్-921, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్-638, ట్రాఫిక్‌ అసిస్టెంట్‌-59 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు నవంబర్‌ 20, 2025వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో సికింద్రాబాద్‌ జోన్‌లో 396 ఖాళీలు ఉన్నాయి.

రైల్వే జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల వివరాలు ఇలా..

రైల్వేలో 2,569 జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆర్‌ఆర్‌బీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 31వ తేదీ నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్‌ 30 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. పైన పేర్కొన్న అన్ని పోస్టులకు ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, రైల్వే మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.