నవంబర్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయనున్న ఫోన్స్ ఇవే..!

 భారత స్మార్ట్‌ఫోన్ ప్రియులకు నవంబర్ నెలలో చైనా దిగ్గజాలైన వన్‌ప్లస్, ఐకూ, రియల్‌మీ, ఒప్పోలతో పాటు స్వదేశీ బ్రాండ్ లావా…వివిధ మోడళ్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నాయి.


మరి ఆ రాబోయే మొబైల్స్ ఏంటి..? వాటి వివరాలేంటో ఒకసారి చూసేద్దామా..

వన్‌ప్లస్ 15 (OnePlus 15):
చైనాలో అక్టోబర్ 27న పరిచయమైన వన్‌ప్లస్ 15, నవంబర్ 13న భారత మార్కెట్‌లోకి అధికారికంగా వస్తున్నట్లు ప్రకటించబడింది. చైనాలో బేసిక్ మోడల్ 12GB+256GB దాదాపు రూ. 50,000 ఉన్నప్పటికీ, భారత్‌లో ఇది రూ.65,000 నుంచి రూ.70,000 మధ్య ఉండవచ్చని అంచనా. ఇక ఈ మొబైల్ ముఖ్య ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 6.78 అంగుళాల మూడవ తరం BOE ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే, 165Hz వరకు రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించనుంది. అలాగే ఇందులో క్వాల్కమ్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (3nm) చిప్‌సెట్ మరియు అడ్రెనో 840 GPU ఉన్నాయి. ఈ మొబైల్ మెమొరీ పరంగా చూస్తే.. 16GB LPDDR5X ర్యామ్, 1TB UFS 4.1 స్టోరేజ్ వరకు లభ్యం అవుతుంది. కెమెరా విభాగానికి వస్తే.. 50MP (f/1.8) ప్రైమరీ షూటర్ (24mm ఫోకల్ లెంగ్త్), 50MP అల్ట్రావైడ్, 50MP టెలిఫొటో కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ యూనిట్ ఉండనుండగా.. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక ఇందులో 7300mAh బ్యాటరీ, 120W సూపర్‌ ఫ్లాష్ ఛార్జ్ (వైర్డ్), 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ ఉండనుంది.

ఐకూ 15 (iQOO 15):
గేమింగ్, పర్ఫామెన్స్ కు ప్రసిద్ధి చెందిన ఐకూ 15 స్మార్ట్‌ఫోన్, నవంబర్ 26న భారతీయ వినియోగదారుల ముందుకు రానుంది. ఈ మోడల్ ధర రూ. 60,000 లోపు ఉండవచ్చని అంచనా. ఇందులో 6.85-అంగుళాల శామ్‌సంగ్ M14 AMOLED డిస్‌ప్లే, 3nm ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ప్రాసెసర్, 16GB వరకు LPDDR5X అల్ట్రా ర్యామ్, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్ ఉండనుంది. అలాగే 50MP ప్రైమరీ సెన్సార్, 50MP పెరిస్కోప్ సెన్సార్, 100x డిజిటల్ జూమ్ అందించే 50MP వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ సెటప్ తో పాటు 32MP సెల్ఫీ కెమెరా ఉండనుంది. ఇక 7,000mAh బ్యాటరీ, 100W వైర్డు, 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతు కలిగి ఉండనుంది.

రియల్‌మీ జీటీ 8 ప్రో (Realme GT 8 Pro):
రియల్‌మీ సంబంధించిన ఈ ఫ్లాగ్‌షిప్ మోడల్ నవంబర్ 11న భారతీయ మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 55,000 లోపు ఉండే అవకాశం ఉంది. ఇందులో 6.79-అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుండగా.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉండనుంది. అలాగే కెమెరా పరంగా OIS తో కూడిన 50MP జీఆర్ యాంటీ-గ్లేర్ ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 120x డిజిటల్ జూమ్ వరకు సపోర్ట్ చేసే 200MP టెలిఫోటో సెన్సార్ ఇందులో ఉండనున్నాయి. అలాగే ఇందులో 7,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో రానుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్ (Oppo Find X9 Series):
ఒప్పో నుంచి ఈ సిరీస్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్9 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్9 అనే రెండు ప్రీమియం మోడల్స్ రానున్నాయి. నవంబర్ 18న రూ.75,000 రేంజ్ లో ఈ మొబైల్స్ లాంచ్ కావచ్చు. ఈ మొబైల్స్ లో అత్యంత ప్రీమియం, ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఈ సిరీస్‌లో ఉండనుంది.

లావా అగ్ని 5 (Lava Agni 5):
భారతీయ బ్రాండ్‌గా లావా అగ్ని 5 తో మిడ్-రేంజ్ విభాగంలో మంచి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ మోడల్ రూ. 25,000 కన్నా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. ఈ మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల FHD+ డిస్‌ప్లే, UFS 4.0 స్టోరేజ్‌తో కలిపిన డైమెన్సిటీ 8350 చిప్‌సెట్, 7,000mAh కన్నా ఎక్కువ బ్యాటరీ, డ్యూయల్ 50MP కెమెరా సెటప్ ఉండనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.