ఎన్టీఆర్ వైద్య సేవలు మళ్లీ ప్రారంభం

 రాష్ట్రంలో కొద్దిరోజులుగా ప్రైవేటు స్పెషాలిటీ ఆస్పత్రుల్లో(Private Speciality Hosptals) ఎన్టీఆర్ వైద్య సేవలు(Ntr Vaidya Sevalu) నిలిపివేసిన విషయం తెలిసిందే.


అయితే ప్రభుత్వం.. ఆస్పత్రుల యాజమాన్యం మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో ఆయా ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది.

కాగా బయికాయిలు విడుదల చేయాలని ప్రైవేటు స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అయితే సానుకూల స్పందన రాకపోవడంతో ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల యాజమాన్యంతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆస్పత్రుల డిమాండ్లు, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగించేందుకు ప్రైవేటు ఆస్పత్రులు అంగీకరించాయి. దీంతో ఈ సేవలను వినియోగించుకునేందుకు రోగులకు లైన్ క్లియర్ అయింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.