డాకర్ట్ చెప్పిన రహస్యం..! ఫ్యాటీ లివర్ నయం కావాలంటే ఈ చిట్కాలు పాటించండి

శరీరంలో ఏ భాగానికి ఎటువంటి చిన్న ఇబ్బంది కలిగినా వైద్యుల వద్దకు పరుగెత్తుతాం. అలాంటి ఒక సమస్య వస్తుందనే ఆలోచన కూడా లేకుండా ఉన్న సమయంలో శరీరంలో పెద్ద వ్యాధి ఉందనే విషయాన్ని జీర్ణం చేసుకోవడమే కష్టంగా మరుతుంది.


అందుకే వీలైనంత ఆరోగ్యంగా ఉంటూ ఉండాలి. సరైన వ్యాయామం, ఆహారం విషయంలో తగినంత శ్రద్ధ కూడా అంతే అవసరం. శరీరంలో ముఖ్యమైన భాగం అయిన కాలేయం, దీని చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది ఫ్ల్యాటీ లివర్ వ్యాధిగా మారుతుంది. దీనిని కొన్ని చిన్న చిన్న చిట్కాలతో నయం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.

ఓ ప్రముఖ వైద్యుడి వివరణ ప్రకారం.. ఫ్యాటీ లివర్ నయం కావాలంటే లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోవాలి. చాలా సాధారణమైన డైట్ తీసుకోవాలి. కొందరి విషయంలో ఉపవాసం పనిచేస్తుంది. శాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్‌ తగ్గించి అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి. అలాగే గ్లైసెమెక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ డ్రింక్స్ తగ్గించాలి. అయితే తక్కువ కొవ్వు గల పాలతో చక్కెర లేకుండా రోజూ 2 నుంచి 3 సార్లు కాఫీ తాగడం వల్ల ఫ్యాటీ లివర్‌ నయం కావడానికి దోహదం చేస్తుందని పేరుంది. ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి వెళ్లొద్దు. బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్, ఇతర ఏరోబిక్ యాక్టివిటీ వంటి వ్యాయామాలు మేలు చేస్తాయి. 6 నుంచి 8 గంటలు తప్పనిసరిగా నిద్రించాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్, యూఎస్‌జీ టెస్ట్, వంటి పరీక్షలను వైద్యులు సిఫారసు చేస్తారు. అయితే ఫ్యాటీ లివర్ వచ్చిందని మనకు మనం గుర్తించలేం. వైద్యుడి సిఫారసుల ఆధారంగా గుర్తించి, వారి సిఫారసుల మేరకే పై మార్పులు చేసుకోవాలి. ఇన్సులిన్ నిరోధకత ఉన్న వారు షుగర్ తగ్గించాలి. అలాగే కూరగాయలు, ఆకుకూరలు, ఆర్గానిక్ ఫ్రూట్స్ మీ డైట్‌లో భాగం కావాలి. అధిక కొవ్వులు ఉండే ఆహారం లివర్ విధులకు సవాలుగా మారుతుంది. దాల్చిన చెక్క, ఆపిల్ సైడర్ వెనిగర్, పసుపు, ఉసిరి వంటివి ఫ్యాటీ లివర్ అనారోగ్యాన్ని క్రమంగా తగ్గిస్తాయి. రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగితే అవి శరీరం హైడ్రేటెడ్‌గా ఉండేలా, రక్తప్రసరణ మెరుగ్గా ఉండేలా చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.