కమర్షియల్ యాడ్‌లో మెరిసిన బాలయ్య కూతురు.. అభిమానులు ఫిదా

నటసింహం నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఓ కమర్షియల్ యాడ్ లో మెరిసింది. ప్రముఖ జ్యూవలరీకి సంబంధించిన యాడ్ లో తేజస్విని నటించింది.


యాడ్ లో తేజస్విని నటన మరియు అందంతో ఆకట్టుకుంది. బాలకృష్ణ కుమారుడు మోక్షాజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తుండగా ఇప్పుడు తేజస్విని స్క్రీన్ పై కనిపించడం ఆసక్తికరంగా మారింది. దీంతో నందమూరి అభిమానులు కుషీ అవుతున్నారు.

అంతే కాకుండా యాడ్ లో నటనతో మెప్పించిన తేజస్విని సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు తేజస్విని గతంలో అఖండ 2 సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు అన్ స్టాపబుల్ షో నిర్మాణంలోనూ ఆమె భాగస్వామ్యం అయ్యారు. ఇక ఇప్పుడు స్క్రీన్ పైనా మెరవడంతో తేజస్వినికి సైతం సినిమాలపై ఆసక్తి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు హీరోల కూతుళ్లు సైతం రాణిస్తున్న సంగతి తెలిసిందే.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.