సొంత డబ్బులతో మొదట కొనుగోలు చేసింది ఎవరికైనా ప్రత్యేకమే. ముఖ్యంగా వాహనాలు, డ్రెస్సులు, ఫోన్లు అయితే మరీ అపురూపంగా దాచుకుంటారు.
అచ్చం ఇలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) ఓ అపురూప జ్ఞాపకం వార్తల్లోకి ఎక్కింది. మూడు దశాబ్దాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపయోగించిన పాత ‘393’ అంబాసిడర్ కారు తాజాగా వైరల్‌గా మారింది. పార్టీ కార్యాలయంలో ఈ కారును పరిశీలించిన సీఎం చంద్రబాబు, దానితో ఉన్న తన అనుబంధాన్ని, పర్యటనల స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా విస్తృతంగా పర్యటించినప్పుడు ఈ 393 నెంబర్ అంబాసిడర్ కారు చంద్రబాబుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇకపై ఈ కారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అపురూపంగా ఉంచబడుతుంది. ముఖ్యమంత్రి తన సొంత వాహనమైన పాత అంబాసిడర్‌ను ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తున్నారని దీని ద్వారా తెలుస్తోంది.




































