గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయ్

దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు గ్యాస్, పెట్రో ఉత్పత్తుల ధరలను సమీక్షిస్తాయి.


కొన్ని సార్లు తగ్గిస్తాయి. మరికొన్ని సార్లు పెంచుతాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఈ పెంపుదల, తగ్గుదల ఆధారపడి ఉంటుంది. అయితే గృహాలకు వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో మార్పు లేదు.

హైదరాబాద్ లో ధర…అయితే వాణిజ్య సిలండర్ ధరలు కొంత తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల వాణిజ్య అవసరాల కోసం వాడే సిలిండర్ ధరపై ఐదు రూపాయలు తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర 1,590.50 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో దీని ధర 1,812 రూపాయలుగా ఉంది. వంట గ్యాస్ గృహ వినియోగించే సిలిండర్ ధర దేశంలో 850 రూపాయల నుంచి 960 రూపాయలుగా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.