భూమిలో పండే అనేక ఆహారాలు మన శరీరానికి కావలసిన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. అటువంటి ఆహారాలలో చిలకడదుంప ఒకటి. అయితే చిలకడదుంపలను ప్రతిరోజు క్రమం తప్పకుండా తినడం వల్ల మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు .
నెలరోజులపాటు ప్రతిరోజు చిలకడదుంప తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
చిలకడ దుంపలతో బరువుకు చెక్
చిలకడదుంపలలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయని ప్రతిరోజు చిలకడదపలను మితంగా తీసుకుంటే అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతున్నారు. చిలకడదుంపలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండి కడుపు నిండిన భావన కలిగిస్తుందని, ఇది అతిగా తినడాన్ని నివారిస్తుందని చెబుతున్నారు. బరువు తగ్గాలని భావించే వారికి చిలగడ దుంప గొప్ప ఆహారం అని చెబుతున్నారు.
షుగర్ నియంత్రణకు చిలకడ దుంపలు
అంతేకాదు చిలకడదుంపలలో ఉండే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చేయడంలో ఎంతగానో దోహదపడుతుందని చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణకు చిలకడదుంపలు దోహదం చేస్తాయని చెబుతున్నారు. చిలకడ దుంపలలో విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు, రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయని చెబుతున్నారు.
చిలకడ దుంపలతో ఈ ప్రయోజనాలు కూడా
చిలగడ దుంపలో ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందని, క్రమబద్ధమైన పేగు కదలికలకు సహాయపడుతుందని చెబుతున్నారు. చిలకడదుంపలలో విటమిన్ ఏ పుష్కలంగా ఉండడం వల్ల ఇది కంటి చూపున మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల ఇది హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుందని అంటున్నారు.
చర్మ ఆరోగ్యానికి, ఇమ్యూనిటీకి ఇవి తినటం బెస్ట్
చిలకడదుంపలలో ఉండే విటమిన్ సి కారణంగా కొల్లాజన్ ఉత్పత్తి అవుతుందని, ఇది మన చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. వీటిని తినడం వల్ల మలబద్ధకం నివారణ అవుతుందని, జీర్ణ ఆరోగ్యాన్ని ఇది ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. ఇది మన ఇమ్యూనిటీని పెంచి రోగాలు రాకుండా కాపాడుతుందని అంటున్నారు.
చిలకడ దుంపలు తినేవారు జాగ్రత్త
అయితే చిలకలదుంపలలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిదని అయితే అతిగా తినడం మాత్రం అనర్ధాలకు దారితీస్తుందని మితంగా తింటే చిలకడదుంపల ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయని చెబుతున్నారు.మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను చిలకడదుంపల విషయంలో ఆలోచన పక్కన పెట్టి మితంగా ప్రతిరోజు తినేందుకు ప్రయత్నించండి.
































