సినిమా ప్రియులు ఇకపై అధిక టిక్కెట్ ధరల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సరైన క్రెడిట్ కార్డును సెలక్ట్ చేసుకోవడం ద్వారా ప్రతి నెలా సినిమా టిక్కెట్లపై పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. దేశంలో సినిమా టిక్కెట్ బుకింగ్‌లపై అద్భుతమైన రాయితీలను అందించే నాలుగు ముఖ్యమైన క్రెడిట్ కార్డుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
హెచ్‌డీఎఫ్‌సీ టైమ్స్ కార్డు: హెచ్‌డీఎఫ్‌సీ టైమ్స్ కార్డ్ సినిమా ప్రియులకు ఒక అద్భుతమైన ఎంపిక. బుక్ మై షోలో టిక్కెట్లు బుక్ చేసుకుంటే, టికెట్‌పై రూ.150 వరకు, ఒక ట్రాన్సక్షన్‌కు రూ.350 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ నెలకు నాలుగు టికెట్లపై వర్తిస్తుంది. టైమ్స్ ప్రైమ్ మెంబర్‌షిప్, ఇతర ఆఫర్‌లు కూడా లభిస్తాయి.
యాక్సిస్ మై జోన్: పేటీఎమ్ ద్వారా సినిమా టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి యాక్సిస్ మై జోన్ క్రెడిట్ కార్డ్ సరైనది. మీరు ప్రతి నెలా ఒక ఉచిత సినిమా టికెట్ పొందుతారు. జొమాటో, స్పాటిఫై, మింత్రా వంటి వాటిపై అదనపు డిస్కౌంట్లు లభిస్తాయి. స్నేహితులతో నెలవారీ సినిమా ప్లాన్ చేసుకునే యువతకు ఇది బెస్ట్ ఆప్షన్.
ఎస్బీఐ ఎలైట్ కార్డు: ఎక్కువ సినిమాలు చూసే వారికి ఎస్బీఐ ఎలైట్ కార్డు బెస్ట్ ఆప్షన్. ఈ కార్డ్ Buy 1 Get 1 Free ఆఫర్‌ను అందిస్తుంది. ఒక్కో టికెట్‌కి రూ.250 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ నెలకు రెండుసార్లు వర్తిస్తుంది. దీని ద్వారా మీరు సంవత్సరానికి దాదాపు రూ.6,000 వరకు ఆదా చేసుకోవచ్చు.
ఐసీఐసీఐ కోరల్ క్రెడిట్ కార్డు: నెలకొకసారి మాత్రమే సినిమాలకు వెళ్లే వారికి ఐసీఐసీఐ కోరల్ క్రెడిట్ కార్డ్ సరిపోతుంది. ఈ కార్డ్ BookMyShowలో 25శాతం వరకు తగ్గింపును, నెలకు రెండుసార్లు అందిస్తుంది. టికెట్‌పై రూ.100 వరకు తగ్గింపు లభిస్తుంది. రెస్టారెంట్లలో ప్రత్యేక భోజన ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్ సేవింగ్స్: మొత్తంమీద ఈ క్రెడిట్ కార్డులలో ఒకదాన్ని ఎంచుకోవడం ద్వారా సినిమా టికెట్లపై మీరు ప్రతి నెలా గణనీయంగా ఆదా చేయవచ్చు. సినిమా చూడటం ఇప్పుడు మరింత ఆనందించదగినదిగా, ఆర్థికంగా స్మార్ట్‌గా మారుతుంది. అయితే ఏదైనా కార్డును ఎంచుకునే ముందు, దానికి సంబంధించిన నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవడం తప్పనిసరి.
































