పదే పదే టెన్షన్ పడుతున్నారా? ఒత్తిడిని దూరం చేసే 5 మార్గాలు ఇవే

మీ మనస్సు కూడా నిరంతరం చంచలంగా లేదా ఎల్లప్పుడూ ఒత్తిడికి గురవుతున్నట్లు అనిపిస్తుందా? అయితే మీరు ఒక్కరే కాదు. ఈ పరిస్థితి ఈ రోజుల్లో చాలా మందిలో ఉంది.


అయితే కొన్ని సులభమైన మార్గాల ద్వారా ఒత్తిడిని తగ్గించి మనస్సును అదుపులోకి తెచ్చుకోవచ్చు.

నిజానికి మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు.. మన ఆలోచన, ప్రణాళిక ఎప్పుడూ నెగిటివ్ వైపే ప్రభావితమవుతాయి. రాంగ్ నిర్ణయాలు తీసుకుంటాము. అలాంటి సమయంలో మీ శరీరంపై కొంత శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. మీ శరీరం ఎలా ఉందో గమనించండి. భుజాలు బిగుసుకుపోవడం.. గుండె వేగంగా కొట్టుకోవడం లేదా కడుపులో భారంగా అనిపించడం వంటివి గమనించండి. నిపుణులు ప్రకారం మీ శరీరం ఏమి చెబుతుందో దానిపై శ్రద్ధ వహించాలి. ఇది మిమ్మల్ని గతం నుంచి ప్రజెంట్​లోకి తీసుకురావడానికి, మనస్సును శాంతింపజేయడానికి సహాయపడుతుంది.

అంతేకాకుండా చాలా మంది ఒత్తిడికి గురైనప్పుడు ఆలోచించడం ఆపేయాలని.. లేదా ప్రశాంతంగా ఉండాలని అని అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆందోళన పెరుగుతుంది. మనస్సును శాంతపరచుకోవడానికి.. మీ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎంత తొందరగా కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయగలిగితే అంత త్వరగా ఒత్తిడి తగ్గుతుంది. శరీరం, మనస్సు రిలాక్స్ అవ్వడం ప్రారంభిస్తాయి.అలాగే మనసు కలత చెందితే.. పెద్ద పనుల గురించి ఆలోచించకుండా చిన్న చిన్న పనులు చేయండి. ఈ చిన్న పనులు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ ఉంటాయి. మనస్సు అతిగా ఆలోచించడం నుంచి బయటకు తీసుకువస్తాయి.

మీ మనసులో చాలా విషయాలు నడుస్తుంటే.. మీరు కొంతసేపు ఆగి.. డీప్ బ్రీతింగ్స్ తీసుకోండి. ఆ సమయంలో మీ ముక్కు ద్వారా నెమ్మదిగా గాలిని పీల్చుకుని నోటి ద్వారా వదలాలి. వాస్తవానికి ఒత్తిడి అనేది మనకు విశ్రాంతి లేదా విరామం అవసరమని కూడా సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీతో మీరు శాంతంగా మాట్లాడటం వల్ల మనస్సు తేలికవుతుంది.

ఒత్తిడి సమయంలో మనసులో భయపడే విషయాలు వస్తాయి. అంటే ఏదో చెడు జరగబోతుంది లేదా నేను చేయలేను వంటి విషయాలు వస్తాయి. ఇవి మీ మనస్సులో కూడా వస్తుంటే.. మొదట అది నిజమా లేదా కేవలం భయమా అని మీతో మీరు మాట్లాడుకోండి. ఎందుకంటే చాలాసార్లు మీ మనస్సు ఊహను, వాస్తవాన్ని కళ్లముందు పెడుతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.