ఈ మూడింట్లో ఏది షుగర్‌కు బెస్ట్ ఆల్టర్నేటివ్ అవుతుందో తెలుసుకుందాం.
చాలామంది హెల్త్ ఎక్స్‌పర్ట్స్ వైట్ షుగర్ (చక్కెర)కు దూరంగా ఉండాలని చెబుతుంటారు. చక్కెర ఎక్కువ తీసుకోవడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తుంటారు. దీనికి బదులుగా దేశీ ఖండ్ (ముడి చక్కెర), బెల్లం, బ్రౌన్ షుగర్‌ని బెస్ట్ ఆల్టర్నేటివ్స్‌గా వాడుతుంటారు.
ఈ తీపి పదార్థాలను తక్కువగా ప్రాసెస్ చేస్తారు, రిఫైన్డ్ షుగర్ కంటే ఎక్కువ నేచురల్ మినరల్స్‌ని కలిగి ఉంటాయి. కానీ ఈ మూడు ఒకేలా ప్రయోజనాలు అందించవు. వాటి పోషక విలువలు, ప్రాసెసింగ్ పద్ధతులు, ఆరోగ్యంపై చూపే ప్రభావాలు మారుతూ ఉంటాయి. మరి ఈ మూడింట్లో ఏది షుగర్‌కు బెస్ట్ ఆల్టర్నేటివ్ అవుతుందో తెలుసుకుందాం.
దేశీ ఖండ్ (Desi Khand) దేశీ ఖండ్ లేదా ఖండ్‌సరి అనేది శుద్ధి చేయని చక్కెర. ఎలాంటి కెమికల్ బ్లీచింగ్ లేకుండా చెరకు రసాన్ని మరిగించి క్రిస్టలైజింగ్ ద్వారా తయారు చేస్తారు. ఇది లైట్ బ్రౌన్ కలర్‌లో ధాన్యం గింజల్లా కనిపిస్తుంది. దీన్ని సల్ఫర్ లేదా యాసిడ్స్‌తో ప్రాసెస్ చేయరు. కాబట్టి ఇది కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, భాస్వరం వంటి ట్రేస్ మినిరల్స్‌ని కోల్పోదు.
డైజెషన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది, కెమికల్స్ లేకుండా క్విక్ ఎనర్జీ అందిస్తుంది. అయితే దేశీ ఖండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువ. అంటే బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని త్వరగా పెంచుతుంది. రిఫైన్డ్ షుగర్ కంటే స్వచ్ఛమైనప్పటికీ మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు లేదా వెయిట్ లాస్‌లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
బెల్లం (Jaggery) బెల్లం కాన్సన్‌ట్రేడెడ్ చెరకు రసం నుంచి తయారు చేస్తారు. రిఫైన్డ్ షుగర్‌లా కాకుండా, బెల్లం నేచురల్ మొలాసిస్‌ను నిలుపుకుంటుంది. ఇది రిచ్ బ్రౌన్ కలర్‌లో, పోషకాలతో నిండి ఉంటుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ ప్రకారం బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
ఇది రక్తహీనతను దూరం చేస్తుంది. దీంట్లో గుండె, కండరాల ఆరోగ్యానికి సపోర్ట్ చేసే పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని దూరం చేస్తాయి, కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి.
బెల్లంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డైజెషన్‌కి సపోర్ట్ చేస్తుంది, కాలేయం, ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో వెచ్చదనం, శక్తిని అందిస్తుంది. అయితే బెల్లంలో సుక్రోజ్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అందుకే దీన్ని చక్కెరకు ప్రత్యామ్నాయంగా కాకుండా, అప్పుడప్పుడు స్వీటెనర్‌గా వాడుకోవాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
బ్రౌన్ షుగర్ (Brown Sugar) బ్రౌన్ షుగర్ చూడటానికి బెల్లం లేదా దేశీ ఖండ్ లాగా కనిపించవచ్చు. కానీ దానిని తయారు చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఇది రిఫైన్డ్ వైట్ షుగర్, కానీ దీనికి మళ్లీ మొలాసిస్ యాడ్ చేస్తారు. దీంతో బ్రౌన్ కలర్, మైల్డ్ కారామెల్ ఫ్లేవర్ యాడ్ అవుతాయి. హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ ప్రకారం, బ్రౌన్ షుగర్‌లో పోషకాలు దాదాపు వైట్ షుగర్‌తో సమానంగా ఉంటాయి.
రెండింటిలోనూ టీస్పూన్‌కు దాదాపు 16 కేలరీలు, సిమిలర్ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ట్రేస్ మినరల్స్ ఉంటాయి. అయితే బ్రౌన్ షుగర్ రక్తంలో షుగర్ లెవల్స్ వేగంగా పెంచుతుంది. అందుకే దీన్ని పోషకాల కోసం కాకుండా టేస్ట్ కోసం బేకింగ్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ కంటే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ అందించదు.
ఇంతకీ ఏ స్వీటెనర్ బెస్ట్? బెల్లం నేచురల్ మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్, ట్రెడిషినల్ హెల్త్ బెనిఫిట్స్‌తో టాప్‌లో ఉంటుంది. సెకండ్ ప్లేస్‌లో దేశీ ఖండ్ ఉంటుంది. ఇది రిఫైన్డ్ షుగర్ కంటే శుభ్రంగా ఉంటుంది, లో ప్రాసెస్ జరుగుతుంది. చివరిగా బ్రౌన్ షుగర్ వస్తుంది.
వైట్ షుగర్‌కి దీనికి పెద్దగా తేడాలు ఉండవు. అయితే ఈ మూడు షుగర్సే అని గుర్తుంచుకోవడం ముఖ్యం. వాటిలో ఏది అతిగా తిన్నా బరువు పెరగడం, షుగర్ లెవల్స్ పెరగడం, డైజెషన్ సమస్యలు వస్తాయి. డయాబెటిస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే బెల్లం, దేశీ ఖండ్ కూడా తక్కువగా వాడాలి.
































