భారతీయ రైల్వే నడిపే రైళ్లల్లో నిత్యం కోట్లాది మంది తమ గమ్యస్థానాలకు చేరుతూ ఉంటారు. మరి ట్రైన్లో మందు తాగితే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా? జరిమానాల గురించి తెలుసుకోండి.
ఇండియన్ ట్రైన్స్‌లో ప్రతి రోజూ కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. సౌకర్యం, వేగం అందిస్తే ప్రయాణం ఆనందకరంగా మారుతుంది. అయితే, కొన్ని సార్లు కొంత మంది ప్రయాణికులు మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుంది. అటువంటి సందర్భాల్లో భారత రైల్వేలు ఒక కఠిన చట్టాన్ని అనుసరిస్తుంది. ఇది రైల్వేస్ యాక్ట్, 1989 సెక్షన్ 145 లో వివరించింది రైల్వే.
ఈ సెక్షన్ ప్రకారం, రైలులో లేదా స్టేషన్లో ఎవరైనా మద్యం తాగి ఉంటే, అసభ్యంగా ప్రవర్తిస్తే, ఇబ్బందికరమైన మాటలు మాట్లాడితే లేదా రైళ్లు అందించే సౌకర్యాలను దుర్వినియోగం చేస్తే, రైల్వే ఉద్యోగులు ఆ వ్యక్తిని రైలు లేదా స్టేషన్ నుండి పంపించేయవచ్చు. ఈ చర్యతో ఆ వ్యక్తి తన టికెట్ లేదా పాస్‌ను కోల్పోతారు. గరిష్టంగా ఆ వ్యక్తికి ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా 500 రూపాయల వరకు జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ అపరాధానికి కనీస శిక్షల పరిమితి కూడా వుండేలా చేసింది. మొదటి సారి తప్పు చేసిన వారికి 100 రూపాయల జరిమానా, రెండోసారి లేదా మరొకసారి తప్పు చేసిన వారికి ఒక నెల జైలు శిక్ష + 250 రూపాయల జరిమానా విధించబడుతుంది. కోర్ట్ వద్ద ప్రత్యేక కారణాలు ఉంటే మాత్రమే ఈ కనీస శిక్షలను మార్చవచ్చు.
రైలులో లేదా స్టేషన్లో ఎవరు మద్యం తాగి, అసభ్యంగా ప్రవర్తించి, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే, రైల్వే సిబ్బంది ఆ వ్యక్తిని తొలగించవచ్చు. ఆ తర్వాత చట్ట ప్రకారం జరిమానా లేదా జైలు శిక్ష కూడా విధించబడవచ్చు. ఇది అందరికి సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి అవసరం.
ఉదాహరణగా, ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి వచ్చి రైలు ఎక్కాడనుకుందాం. అతని వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది ఎదురైనా, అతను అసభ్యకరంగా మాట్లాడినా, ప్రవర్తించినా రైలు సిబ్బంది అతడి ప్రవర్తనను గమనించి, సెక్షన్ 145 ప్రకారం ఆ వ్యక్తిని రైలు నుండి తొలగిస్తారు. మొదటి సారి తప్పు చేస్తే జాన్ 100 రూపాయల జరిమానా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది రెండోసారి తప్పు అయితే, ఒక నెల జైలు శిక్షతో పాటు 250 రూపాయల జరిమానా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
సో… ఇకపై రైలులో ఎవరైనా తాగినట్టు కనిపించినా, మద్యం తాగుతున్నా, మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తున్నా రైల్వే సిబ్బందికి కంప్లైంట్ చేయండి. ఆ వ్యక్తిపై రైల్వే అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది.
































