నిన్నటితో పోల్చి చూస్తే నేడు బంగారం ధర తగ్గింది. నవంబర్ మూడో తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,000 పలుకుతోంది, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,750 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,52,500 పలుకుతోంది. పసిడి ధరలు గడచిన వారం రోజులుగా గమనించినట్లయితే భారీగా తగ్గుతున్నట్టు చూడవచ్చు. బంగారం ధర ఇప్పటికే ఆల్ టైం రికార్డుతో పోల్చి చూస్తే దాదాపు 12 వేల రూపాయలు తక్కువగా ట్రేడ్ అవుతున్నట్లు గమనించవచ్చు. బంగారం ధర అక్టోబర్ 20వ తేదీన 1.35 లక్షల రూపాయల వద్ద ఆల్ టైం రికార్డును దాటింది. అక్కడ నుంచి బంగారం ధరలు తగ్గడం గమనించవచ్చు.
బంగారం ధరలు గడచిన కొన్ని సంవత్సరాలుగా గమనించినట్లయితే, భారీగా పెరిగిపోయాయి. నిజానికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి గమనించినట్లయితే, బంగారం ధర దాదాపు 50 శాతం పైన పెరిగింది. పసిడి ధరలు భారీగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణంగా చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం బంగారం ధర తగ్గడానికి మాత్రం డాలర్ విలువ పెరగడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అలాగే చైనా అధ్యక్షుడు జింపింగ్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ రియాక్షన్ కనిపిస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నారు. దీంతో బంగారం ధర భారీగా తగ్గడం గమనించవచ్చు. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గుతోంది. ఒక దశలో రెండు లక్షల రూపాయలకు ఒక కేజీ వరకు వెళ్లిన వెండి ప్రస్తుతం 50 వేల రూపాయల వరకు తగ్గింది. దీనికి ప్రధాన కారణం వెండిలో వచ్చినటువంటి టెక్నికల్ కనెక్షన్ ఒక కారణంగా చెబుతున్నారు.
Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సూచిస్తోంది.
































