కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్య నిధి (EPF) పరిధిలోకి మరింత మంది ఉద్యోగులను తీసుకురావడం లక్ష్యంగా ‘ఎంప్లాయీస్ ఎన్‌రోల్‌మెంట్ స్కీమ్ 2025 ‘ అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది.
ఈ స్కీమ్ నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది.
ఈ స్కీమ్ నవంబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది.
ఈ పథకం కింద, కంపెనీలు తమ ఉద్యోగులను EPFOలో స్వచ్ఛందంగా నమోదు చేయవచ్చు. గతంలో ఉద్యోగి వాటా (employee share) చెల్లించకపోయినా, పాత బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా రూ.100 నామమాత్రపు పెనాల్టీ కడితే సరిపోతుంది.
స్కీమ్ కాలపరిమితి
- ప్రారంభం: నవంబర్ 1, 2025
- ముగింపు: ఏప్రిల్ 30, 2026
- అర్హులైన ఉద్యోగులు: 2017 జూలై 1 నుండి 2025 అక్టోబర్ 31 మధ్య ఉద్యోగంలో చేరి, ఇప్పటివరకు EPF కవరేజీ లేని వారు.
పథకం ప్రయోజనాలు
- EPF కవరేజ్ లేని ఉద్యోగులకు సామాజిక రక్షణ
- సంస్థలకు సులభతర నమోదు ప్రక్రియ
- పాత లోపాలను సరిదిద్దుకునే అవకాశం
- పారదర్శకత, సామర్థ్యం, సమానత్వం కలిగిన సిస్టమ్ ఏర్పాటు
EPFO: కార్మికుల నమ్మకానికి ప్రతీక
మంత్రి మాండవీయా మాట్లాడుతూ, ‘EPFO కేవలం ఒక నిధి మాత్రమే కాదు, ఇది భారతీయ కార్మికులకు ఆర్థిక భద్రతా చిహ్నం. ఇందులో జరుగుతున్న మార్పులు పారదర్శకత, సామర్థ్యం, సమానభావం ఆధారంగా కొనసాగుతున్నాయి,’ అని తెలిపారు.
































