ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఖజానా.. బయటకు తీస్తే తులం 10 వేలే

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికా, కేవలం అతిపెద్ద బంగారు నిల్వలు కలిగి ఉండటమే కాదు, ఆ నిల్వలను అత్యంత సురక్షితంగా కాపాడుకునే అభేద్యమైన ఖజానాకు కూడా పేరుగాంచింది.


బంగారం ప్రియుల దృష్టిని ఆకర్షించే ఈ అద్భుతమైన నిధి రహస్యం మరెక్కడా లేదు, న్యూయార్క్ నగరం గుండెల్లో దాగి ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ ఖజానా

న్యూయార్క్ నగరంలోని మాన్‌హట్టన్ కింద లోతుగా ఉన్న ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ వద్ద ఉన్న బంగారు ఖజానా ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత సురక్షితమైన బంగారం నిల్వ కేంద్రం. ఈ ఖజానాలో ప్రస్తుతం సుమారు 6,190 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వ ఉంది. ఈ మొత్తం బంగారం విలువ నేటి లెక్కల ప్రకారం సుమారు $582 బిలియన్లు ₹5,11,09,26,12,00,000) దాటింది. ముఖ్యంగా, ఇందులో అధిక భాగం అమెరికాకు చెందినది కాకుండా, ప్రపంచంలోని ఇతర దేశాలకు సంబంధించినదే కావడం విశేషం.

అభేద్యమైన భద్రత: 80 అడుగుల లోతులో…

1920లలో నిర్మించబడిన ఈ ఖజానా సామాన్యమైనది కాదు. ఇది భూమట్టానికి ఏకంగా 80 అడుగుల లోతున, సముద్ర మట్టానికి 50 అడుగుల దిగువన, గట్టి రాతిపై చెక్కబడింది. దీని అభేద్యతకు ప్రధాన కారణం, దీని నిర్మాణం. ఈ ఖజానా రాతిపై చెక్కబడటం వలన పగలగొట్టడం దాదాపు అసాధ్యం.

భద్రతకు పెద్దపీట వేస్తూ, ఖజానాకు 90 టన్నుల బరువున్న ఉక్కు తలుపులు అమర్చారు. ఇవి గాలి, నీరు కూడా లోపలికి చొరబడకుండా పూర్తిగా ఎయిర్ టైట్, వాటర్ టైట్గా ఉంటాయి. గోడలను ఉక్కు,కాంక్రీటుతో పటిష్టంగా నిర్మించారు. ప్రతి అంగుళాన్ని సీసీటీవీ కెమెరాలు ,మోషన్ సెన్సార్ల ద్వారా పర్యవేక్షిస్తారు.

ప్రతి ఇటుకకు ముగ్గురు అధికారులు

ప్రస్తుతం ఈ ఖజానాలో 6,331 మెట్రిక్ టన్నుల బరువున్న సుమారు 507,000 బంగారు ఇటుకలు నిల్వ చేశారు. ఈ నిల్వను 122 ప్రత్యేక గదులలో ఉంచారు. ప్రతి గదిని మూడు వేర్వేరు తాళాలతో భద్రపరుస్తారు. అత్యంత కఠినమైన నియమం ఏమిటంటే, ఇక్కడి నుంచి ఎప్పుడైనా బంగారం తీయాలన్నా లేదా తరలించాలన్నా, కనీసం ముగ్గురు అధికారులు (ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు, ఒక ఆడిట్ సిబ్బంది) తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా, వందలాది మంది ప్రత్యేక భద్రతా సిబ్బంది ఈ నిధికి నిత్యం కాపలా కాస్తుంటారు.

ఈ ఖజానా అత్యంత కఠినమైన భద్రత, భారీ నిల్వల కారణంగా ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన బంగారు నిల్వల కేంద్రంగా చరిత్ర సృష్టించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.