కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో తొలిసారిగా భారతదేశం ICC మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.


దీంతో కౌర్ మొత్తం దేశం గర్వపడేలా చేసింది. 36 ఏళ్ల వయసులో ఆమె మైదానంలో ఎంతో ఉత్సాహంగా, ఫిట్‌నెస్‌తో కనిపిస్తారు. సరే ఈ విషయాలను పక్కన పెడితే ఆమె ఆస్తులు, ఆమె సంపద, ఆదాయం, బ్రాండ్ విలువ తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆమె సంపాదన ఎంతో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..

హర్మన్‌ప్రీత్ కౌర్ నికర ఆస్తుల విలువ రూ.25 కోట్లు..
పలు నివేదికల ప్రకారం.. 2024-25లో హర్మన్‌ప్రీత్ కౌర్ నికర ఆస్తుల విలువ దాదాపు ₹25 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ఆదాయం క్రికెట్ నుంచి మాత్రమే కాకుండా, ఎండార్స్‌మెంట్‌లు, బ్రాండ్ ఒప్పందాలు, లీగ్ క్రికెట్ నుంచి కూడా వస్తుంది. ఆమె సారథ్యంలో టీమిండియా ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ కప్ టైటిల్‌కు గెలుచుకుంది. హర్మన్‌ప్రీత్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)లో గ్రేడ్ A క్రీడాకారిణి. ఈ విభాగంలోని ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.50 లక్షల స్థిర జీతం లభిస్తుంది. ఇంకా ఆమె ఒక్కో మ్యాచ్‌కు గణనీయమైన మొత్తాన్ని కూడా సంపాదిస్తుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. టెస్ట్ మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు, T20 మ్యాచ్‌కు రూ.3 లక్షలు తీసుకుంటుందని అంచనా.

WPL నుంచి కోట్లు..
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో హర్మన్‌ప్రీత్ కౌర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్నారు. ఈ లీగ్ నుంచి ఆమె ప్రతి సీజన్‌కు సుమారు రూ.1.80 కోట్ల జీతం సంపాదిస్తుంది. విదేశీ లీగ్‌లు, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లలో ఆడటం ద్వారా ఆమె అదనపు ఆదాయాన్ని కూడా అర్జిస్తుంది. ఇవన్నీ ఆమెను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే మహిళా క్రికెటర్లలో ఒకరిగా నిలిచేలా చేస్తున్నాయి. హర్మన్‌ప్రీత్ పేరు నేడు అనేక ప్రధాన బ్రాండ్‌లతో ముడిపడి ఉంది. ఆమె HDFC లైఫ్, ప్యూమా, బూస్ట్, ITC, టాటా సఫారీ, CEAT, ఆసియన్ పెయింట్స్, జైపూర్ రగ్స్, ఓమాక్స్ ఎస్టేట్ వంటి ప్రఖ్యాత బ్రాండ్‌లకు ప్రచారకర్తగా ఉన్నారు. ఆమె బ్రాండ్ డీల్‌కు సుమారు రూ.10-12 లక్షలు సంపాదిస్తున్నారని అంచనా. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా ఆమె మొత్తం వార్షిక ఆదాయం రూ.40 నుంచి 50 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. అలాగే హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ముంబై, పాటియాలాలో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. పాటియాలాలోని ఆమె కుటుంబ బంగ్లాను “హర్మన్‌ప్రీత్ కౌర్ పాటియాలా హౌస్” అని పిలుస్తారు. ఆమె 2013లో ముంబైలో తన మొదటి ఇంటిని కొనుగోలు చేసింది. ఆమె వాహనాల సేకరణ కూడా ఆకట్టుకుంటుంది, వింటేజ్ జీపుల నుంచి హార్లే-డేవిడ్సన్ బైక్‌ల వరకు ఆమె గ్యారెజ్‌లో దర్శనం ఇస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.