టాలీవుడ్ స్టార్ నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా పలు చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
అలాగే రాజకీయాల్లోనూ రాణిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ‘ఓజీ’తో హిట్ అందుకున్న ఆయన నిత్యం వివాదాస్పద కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డుల జూరీ ఛైర్మన్‌గా పలు కామెంట్స్ చేశారు. ”జాతీయ చలనచిత్ర అవార్డులు రాజీ పడుతున్నాయని చెప్పడానికి నేను అస్సలు భయపడను. కేరళ అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే, వారు నన్ను పిలిచినప్పుడు.. అనుభవం ఉన్న ఒక బయటి వ్యక్తి అవసరమని, తాము ఈ ప్రక్రియలో తల దూర్చబోమని, నిర్ణయాధికారం పూర్తిగా నాకే ఉంటుందని చెప్పారు.
కానీ నేషనల్ అవార్డుల్లో ఇది జరగడం లేదు. అది మనం చూస్తూనే ఉన్నాం. కొందరికి మాత్రమే అవార్డులు వస్తున్నాయి. ఈ జాబితాలో మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం వంటి వారికి అవార్డులు వస్తున్నాయి. అలాంటి జ్యూరీ, అలాంటి జాతీయ ప్రభుత్వ విధానాలు ఉన్నప్పుడు.. గొప్ప వ్యక్తి మమ్ముకా (మమ్ముట్టిని ఆప్యాయంగా పిలిచే పేరు)కు అలాంటి అవార్డులు అవసరం లేదు. వినయంతో, సినిమా సోదరులు పిల్లల మూవీస్ తీయడం గురించి ఆలోచించాలని మేము అభ్యర్థిస్తున్నాము. దర్శకులు, రచయితలు ఇది కేవలం పెద్దలు, యువకులు మాత్రమే కాదు, పిల్లలు కూడా సమాజంలో భాగమని గ్రహించాలి” అని చెప్పుకొచ్చారు.
































