గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా.. తక్కువ వడ్డీకే లోన్ ఇస్తున్న టాప్ బ్యాంకులు ఇవే.

బంగారం అంటే భారతీయులకు ఎక్కడలేని సెంటిమెంట్ ఉంటుంది. వేడుక ఏదైన బంగారం కొనాల్సిందే. ఇక గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భగభగమంటున్నాయి. అయితే అత్యవసరమైనప్పుడు బంగారం ఎంతో ఉపయోగపడుతుంది.


బంగారం అమ్మకుండానే గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. చాలా బ్యాంకులు తక్కువ వడ్డీకే లోన్స్ అందిస్తున్నాయి. ఆ వివరాలను ఈ స్టోరీల తెలుసుకుందాం.. బంగారు రుణాలు తీసుకోవాలనుకునే వారికి, రూ. 1 లక్ష రుణానికి (ఒక సంవత్సరం కాలపరిమితితో) వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు మరియు EMI వివరాలు ఇక్కడ ఉన్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రస్తుతం అత్యంత తక్కువ వడ్డీ రేటును అందిస్తూ అగ్రస్థానంలో ఉంది. ఈ బ్యాంక్ 8.35 శాతం వడ్డీతో బంగారు రుణాలను ఇస్తోంది. ఒక లక్ష రూపాయల రుణానికి.. నెలవారీ వాయిదా (EMI) రూ. 8,715 అవుతుంది.

ఇండియన్ బ్యాంక్ – ఐసిఐసిఐ బ్యాంక్

ఇండియన్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ రెండూ ఒకే రకమైన వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఈ బ్యాంకులు 8.75 శాతం వడ్డీతో బంగారు రుణాలను ఇస్తున్నాయి. లక్ష రూపాయల రుణానికి.. నెలవారీ EMI రూ. 8,734 అవుతుంది.

కెనరా బ్యాంక్

కెనరా బ్యాంక్ 8.95 శాతం వడ్డీతో బంగారు రుణాలను ఇస్తోంది. ఒక సంవత్సరం కాలపరిమితితో రూ. లక్ష రుణానికి, నెలవారీ EMI రూ. 8,743 అవుతుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్

కోటక్ మహీంద్రా బ్యాంక్ 9.00 శాతం వడ్డీ రేటుతో బంగారు రుణాలను అందిస్తుంది. నెలవారీ EMI రూ. 8,745 అవుతుంది.

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఒక సంవత్సరం కాలపరిమితితో ఇచ్చే బంగారు రుణాలపై 9.30 శాతం వడ్డీ వసూల్ చేస్తుంది. దీనికి నెలవారీ EMI రూ. 8,759 అవుతుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా – బ్యాంక్ ఆఫ్ ఇండియా

బ్యాంక్ ఆఫ్ బరోడా – బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండూ 9.40 శాతం వడ్డీతో గోల్డ్ లోన్స్ ఇస్తున్నాయి. లక్ష రూపాయల రుణానికి.. నెలవారీ EMI రూ. 8,764 అవుతుంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.65 శాతం వడ్డీకి బంగారు రుణాలను ఇస్తోంది. ఒక సంవత్సరం కాలపరిమితితో రూ. లక్ష రుణానికి, నెలవారీ EMI రూ. 8,775 అవుతుంది.

యాక్సిస్ బ్యాంక్

యాక్సిస్ బ్యాంక్ 9.75 శాతం వడ్డీ రేటుతో బంగారు రుణాలను అందిస్తుంది. దీనికి నెలవారీ EMI రూ. 8,780 అవుతుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1 లక్ష బంగారు రుణాలపై 10 శాతం వడ్డీ వసూల్ చేస్తుంది. దీనికి నెలవారీ EMI రూ. 8,792 అవుతుంది.

ఇండస్‌ఇండ్ బ్యాంక్

ఇండస్‌ఇండ్ బ్యాంక్ గోల్డ్ లోన్స్‌పై 10.50 శాతం వడ్డీ వసూల్ చేస్తుంది. దీనికి నెలవారీ EMI రూ. 8,815 అవుతుంది.

బంగారు రుణం కోసం దరఖాస్తు చేసే ముందు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు వంటివి క్షున్నంగా చెక్ చేసుకోండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.