విమాన ప్రయాణికులకు శుభవార్త.. 48 గంటల్లోపు టికెట్ రద్దు, మార్పులు ఉచితం

విమాన ప్రయాణికులకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పెద్ద ఊరట కలిగించించింది. ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలు సిద్ధం చేసింది.


ఇకపై ప్రయాణికులు విమాన టికెట్లు బుక్ చేసుకున్న 48 గంటల్లోపు ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా రద్దు చేసుకోవచ్చు, మార్పులు చేసుకోవచ్చు. ఈ ప్రతిపాదనల ప్రకారం.. ప్రయాణికుడు బుకింగ్ చేసిన 48 గంటల్లోపు తన ప్రణాళికలో మార్పులు చేసుకోవాలనుకుంటే, ఎయిర్‌లైన్స్ అదనపు రద్దు ఛార్జీలు వసూలు చేయరాదు. అదేవిధంగా, టికెట్ రద్దు జరిగితే తక్షణ రీఫండ్ ఇవ్వడం తప్పనిసరి అవుతుంది.

ప్రస్తుతం ఈ నియమాలు డ్రాఫ్ట్ దశలో ఉన్నాయని, DGCA వాటిపై ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత తుది రూపం ఇస్తుందని అధికారులు తెలిపారు. ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడటమే ఈ మార్పుల ఉద్దేశమని వెల్లడించారు. గతంలో విమాన టికెట్ల రద్దు, మార్పులపై భారీ ఫీజులు వసూలు చేస్తున్నాయనే విమర్శల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, ప్రయాణికులకు మరింత సౌలభ్యం లభించనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.