కార్తీక పున్నమి వేళ…ఒక అద్భుతం…డోంట్ మిస్

కార్తీక పున్నమి బుధవారం రేపు వస్తోంది. పున్నమి అంటేనే ఒక సంతోషం, ఆనందం. కవులకు పున్నమి అంటే ఒక అద్వితీయ భావన. ప్రేమికులకు ఆ వెలుగులు చూస్తే తీయని ప్రేరణ.


ఇక ప్రతీ నెలా పున్నమి వస్తుంది కానీ కార్తీక మాసంలో వచ్చే పున్నమికి ఎంతో విశిష్టత ఉంది. ఆధ్యాత్మికంగానే కాదు ఖగోళ శాస్త్ర పరంగా కూడా ఈ పున్నమికి ప్రత్యేకంగా చూస్తారు. ఆ రోజున చంద్రుడు మరింత పెద్దగా కనిపించి మురిపిస్తాడు. ఈసారి కార్తీక పున్నమికి మరింతగా ఎదిగి సూపర్ మూన్ గా దర్శనం ఇవ్వబోతున్నాడు.

ఒక మధురానుభూతి :

ఇదిలా ఉంటే కార్తీక పున్నమి వేళ చంద్రుడు సూపర్ మూన్ గా ఈసారి కనిపించబోతున్నాడని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ రోజున చంద్రుడిని చూడాలనుకున్న వారికి కంటి నిండానే కాదు మనసు నిండా ఒక ఆనందమే. అది అద్భుతమే అని అంటున్నారు. సాధారణం కంటే పెద్దగా కనిపించే ఈ చంద్రుడు మరింత ప్రకాశవంతంతంగా కూడా కనిపిస్తారు. దానిని ఖోగోళ శాస్త్రంలో బీవర్ సూపర్ మూన్ గా అభివర్ణిస్తారు. పున్నమి రోజున చంద్రుడు తన కక్ష్యలో తాను తిరుగుతూనే భూమికి అత్యంత దగ్గరకు వస్తారుడు. ఈ సమయంలోనే ఒక అద్భుత దృశ్యం అయితే అంతరిక్షంలో ఆవిష్కృతం అవుతుంది అని అంటున్నారు.

గతంలో అక్కడ :

ఇటువంటి అద్భుతాలు ఈ భూగోళం మీద గతంలో ఎక్కడ జరిగాయి అంటే చైనాలోని చెంగ్డులోని లాంగ్ క్వాన్ పర్వత ప్రాంతాలలో కనిపించింది అని చెబుతున్నారు. ఇక చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్య పూర్తిగా వృత్తాకారంలో ఉండదని చెబుతారు. అయితే ఆ కక్ష్యలో తిరిగే సమయంలో భూమికి చంద్రుడు దగ్గరగా దూరంగా వచ్చీ వెళ్తూంటడు. అలా పున్నమి రోజున చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చిన సందర్భంలో సూపర్ మూన్ గా పరిగణిస్తారు. భూమికి చంద్రుడికి మధ్య దూరం ఈ సమయంలో ఎంత అంటే మూడు లక్షల 57 వేల కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. ఇలా దగ్గరకు చంద్రుడు రావడం వల్లనే సాధారణ పరిస్థితుల కంటే ఏడు శాతం పెద్దగా వీక్షకులకు చంద్రుడు కనిపిస్తాడు అన్న మాట. మామూలుగానే చంద్రుడు పున్నమి వేళ చల్లని వెన్నెలలు కురిపిస్తూ ఎంతో కాంతులు ఇస్తాడు. అయితే ఈ సూపర్ మూన్ టైం లో సాధారణం కంటే కూడా పదహారు శాతం ఎక్కువగా ప్రకాశవంతంగా కనిపించి కను విందు చేస్తాడు అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతారు.

అన్ని వేళలలో కాదు :

ఇక చంద్రుడు ప్రతీ పున్నమి వేళ సూపర్ మూన్ గా కనిపించడు, దానికి ఒక ప్రక్రియ ఉంది భూమికి చంద్రుడు చేరుకున్న సమయంలో భూమి చుట్టూరా ఒక దీర్ఘ వృత్తాకారం కక్ష్యలోకి చాలా సమీపంలో పెరిజీకి దగ్గరగా ఉన్నపుడే సూపర్ మూన్ అన్నది ఏర్పడుతుంది అంటారు. సైంటిఫిక్ టెర్మినాలజీలో పెరిజీ అంటే పున్నమి అని అర్ధం.

కంటితోనే చూడొచ్చు :

చంద్రుడిని పున్నమి వేళ సూపర్ మూన్ సమయంలో చూసేందుకు ప్రత్యేకంగా ఏ పరికరం అవసరం లేదని అంటున్నారు. సాధారణంగానే కనిపిస్తాడుట. ఇక ఈ సూపర్ మూన్ ప్రక్రియ భారత కాల మానం ప్రకారం బుధవారం సాయంత్రం 6.49 గంటలకు చూడవచ్చు అని అంటున్నారు. ఈ సూపర్ మూన్ వేళ చంద్రుడు పక్కన నక్ష్త్రాలు కూడా స్పష్టంగా కనిపించవు. ఎందుకంటే అంతటి కాంతిని ఆ సమయంలో చంద్రుడు వెదజల్లుతాడు కాబట్టి. మొత్తం మీద సూపర్ మూన్ ని డోంట్ మిస్ అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. చంద్రుడు అందించే అద్భుతం ఎవరికి ఏ విధంగా కొత్త అనుభూతులకు తీసుకుని వెళ్తుందో చూడాల్సిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.