నిరుద్యోగులకు శుభవార్త. ఇంటర్మీడియట్ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకుంటే అటువంటి బంపర్ అవకాశాన్ని మీకు ఇస్తుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్.
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి విభాగంలో 3058 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పరీక్షలో విజయం సాధిస్తే రైల్వేలో ఈజీగా ఉద్యోగం పొందవచ్చు.
RRB,NTPCలో డిగ్రీ మరియు ఇంటర్ అర్హతలతో ఉద్యోగాల నోటిఫికేషన్లు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ntpc విభాగంలో డిగ్రీ మరియు ఇంటర్ అర్హతలతో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఇప్పటికే డిగ్రీ అర్హతతో 5810పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హతతో మరో అవకాశం కూడా నిరుద్యోగులకు లభించింది. అర్హత ఉన్నవారు రెండు రకాల పోస్టులకు పోటీపడవచ్చు. ఈ పరీక్షలు విడివిడిగా జరుగుతున్న నేపథ్యంలో డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు రెండు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల జాబితా ఇలా
అభ్యర్థులు పరీక్ష కోసం తెలుగు మాధ్యమాన్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఆర్ఆర్బీ పరిధిలోని ఖాళీలలో ఏదో ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక ntpc ఇంటర్ స్థాయిలో కమర్షియల్ కం టికెట్ క్లర్క్స్ 2424 పోస్టులు, అకౌంట్స్ క్లర్క్స్ కం టైపిస్ట్ 394 పోస్టులు, జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్ 163 పోస్టులు, ట్రైన్స్ క్లర్క్ 77 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి .
మొదటి నెల నుంచి 40 వేల వరకు జీతం
కమర్షియల్ కం టికెట్ క్లర్క్ పోస్టులు లెవెల్ 3 కిందికి వస్తాయి. వీళ్లకు మొదటి నెల నుంచి 40 వేల వరకు జీతం వస్తుంది. మిగిలిన పోస్టులన్నీ లెవెల్ టు కిందికి వస్తాయి. వీరికి సుమారు 36 వేల జీతం మొదటి నెల నుంచి వస్తుంది. ఈ పోస్టులు అన్నింటినీ భర్తీ చేయడానికి రెండు దశల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. టైపిస్ట్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
అర్హతలు ఇవే.. వీరికి వయసు సడలింపు
పరీక్షల ఫలితాలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తర్వాత ఫైనల్ గా ఎలక్షన్ జరుగుతుంది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు 18సంవత్సరాల నుండి 30సంవత్సరాల వయసులో వారే ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీని బట్టి పది నుంచి పదిహేనేళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా సమాన స్థాయి కోర్సులలో 50శాతం మార్కులు సాధించిన వాళ్లు మాత్రమే అప్లై చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు పాస్ అయితే సరిపోతుంది. డిగ్రీ లేదా పీజీ అర్హతలు ఉన్న వారు ఇంటర్లో 50 శాతం మార్కులు దాటకపోయిన దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 27వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కావడంతో దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం RRB అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
































