రైల్వే టికెట్‌ బుకింగ్‌ విధానంలో మార్పులు

ఆ సమయంలో లోయర్‌ బెర్త్‌లు అందుబాటులో ఉంటేనే వారికి దానిని కేటాయిస్తారు. అయితే సిబ్బంది తరువాత ఆయా సీట్ల లభ్యతను బట్టి వాటిని వారికి కేటాయించ వచ్చు. అలాగే లోయర్‌ బెర్త్‌ లభ్యమైతేనే బుక్‌ చేయమనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. రిజర్వ్‌ కోచ్‌లలో నిద్ర వేళలు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్ణయించారు. స్టేషన్లలో లైసెన్స్‌డ్‌ పోర్టర్లు కూడా మీకు సహాయం చేస్తారు. కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో వృద్ధులు, గర్భిణులు తాము ఎక్కే బోగీ వరకూ చేరుకోవచ్చు. వృద్ధులు, వైకల్యం ఉన్న వారికి ఇబ్బందులు లేకుండా స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఉన్నాయి. ప్రయాణ సమయంలో ఏదైనా కారణాలవల్ల కొన్నిసార్లు ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది. సీటు విరిగిపోవడం, కోచ్‌లో ఇచ్చిన దుప్పట్లు సరిగా లేకపోవడం, కోచ్‌లు అపరిశుభ్రంగా ఉండటం, ఏసీ పని చేయకపోవడం, ఫోన్‌ ఛార్జింగ్‌ స్లాట్‌ పని చేయకపోవడం, ఆహారం బాగోలేకపోవడం వంటివి. వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్‌ 139 లేదా ‘రైల్‌ మదద్’ యాప్‌ ద్వారా కంప్లైంట్ చేసే హక్కు ప్రయాణికుడికి ఉంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.