బంపర్ ఆఫర్..రూ.30,950లకే ఎలక్ట్రిక్ స్కూటర్

లక్ట్రిక్ స్కూటర్ కొనాలని కలలు కంటున్నారా? అయితే, లక్షల్లో ధరలు, డ్రైవింగ్ లైసెన్స్, ఖరీదైన రిజిస్ట్రేషన్ ఫీజులు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నాయా?


అయితే, మీ కోసం ఆ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతూ మార్కెట్లోకి వచ్చింది గ్రీన్ కంపెనీ నుంచి వచ్చిన ‘ఇన్విక్టా’ (Invicta) మోడల్. ఈ చవకైన, పవర్‌ఫుల్ స్కూటర్ ప్రస్తుతం అమెజాన్‌లో ఏకంగా 63 శాతం భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉండటం వినియోగదారులను ఆకర్షిస్తోంది.

‘ఇన్విక్టా’ స్కూటర్‌ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం… దాని టాప్ స్పీడ్. దీని గరిష్ట వేగం కేవలం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే. దీని అర్థం ఏమిటంటే – చట్ట ప్రకారం, ఈ స్కూటర్ నడపడానికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన పనీ లేదు. ఈ రెండు పెద్ద ఖర్చులు ఆదా అవ్వడం వల్ల, బ్రాండెడ్ ఈవీల ధరలు అందుబాటులో లేని వారికి ఇది నిజమైన వరం.

ఈ స్కూటర్‌లో 48V సామర్థ్యం గల లెడ్ యాసిడ్ బ్యాటరీ ఉంది. అత్యంత సౌకర్యవంతమైన ఫీచర్ ఏమిటంటే ..ఈ బ్యాటరీని వాహనం నుంచి బయటకు తీసి, మీ ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 4 నుంచి 6 గంటలు ఛార్జింగ్ చేస్తే, ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌పై ఏకంగా 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. దీని నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. సుమారు 100 కిలోమీటర్లు తిరగడానికి అయ్యే ఖర్చు రూ.20 లోపే ఉంటుందని అంచనా. కేవలం 92 కేజీల బరువు ఉన్నందున నడపడం కూడా చాలా సులువు.

మెరుగైన భద్రత, స్టైలిష్ డిజైన్

ఇన్విక్టా కేవలం చవకైనదే కాదు, దృఢంగానూ ఉంది. మెటల్ బాడీతో తయారైనందున ఎక్కువ కాలం మన్నుతుంది. భద్రత కోసం ప్రత్యేకంగా డ్యూయల్ బ్రేకింగ్ సిస్టమ్ ఇచ్చారు. దీనివల్ల డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేసినా, స్కూటర్ స్కిడ్ అవ్వకుండా నియంత్రించబడుతుంది. రాత్రి ప్రయాణాల కోసం ముందువైపు LED లైట్, అలాగే అందమైన కలర్‌ఫుల్ LCD క్లస్టర్ స్కూటర్‌కు మరింత లుక్‌ను ఇస్తాయి.

సాధారణంగా ₹95,000 ధర ఉండే ఈ ‘ఇన్విక్టా’ ఎలక్ట్రిక్ స్కూటర్, ప్రస్తుతం అమెజాన్‌లో భారీ ఆఫర్‌తో కేవలం రూ.34,999కే అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డు ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు కలుపుకుంటే, దీని ధర రూ.30,950 కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. EMI ఆప్షన్ (తొలి వాయిదా రూ.1,697) కూడా అందుబాటులో ఉంది. పవర్‌ఫుల్ ప్యాకేజీ, తక్కువ ఖర్చు, లైసెన్స్ టెన్షన్ లేని ఈ స్కూటర్ నిజంగా యూత్‌కి, రోజువారీ అవసరాలకు గొప్ప అవకాశం అనడంలో సందేహం లేదు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.