దేశ వ్యాప్తంగా ఉన్నపలు బ్రాంచుల్లోని వివిధ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (ఎల్బీఓ) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 23, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..
- ఆంధ్రప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 05
- గుజరాత్లో పోస్టుల సంఖ్య: 95
- కర్ణాటకలో పోస్టుల సంఖ్య: 85
- మహారాష్ట్రలో పోస్టుల సంఖ్య: 135
- తెలంగాణలో పోస్టుల సంఖ్య: 88
- తమిళనాడులో పోస్టుల సంఖ్య: 85
- పశ్చిమ బెంగాల్లో పోస్టుల సంఖ్య: 90
- జమ్మూ &కాశ్మీర్లో పోస్టుల సంఖ్య: 20
- లద్దాఖ్‌లో పోస్టుల సంఖ్య: 03
- అరుణాచల్ ప్రదేశ్‌లో పోస్టుల సంఖ్య: 05
- అస్సాంలో పోస్టుల సంఖ్య: 86
- మణిపుర్లో పోస్టుల సంఖ్య: 08
- మేఘాలయలో పోస్టుల సంఖ్య: 08
- మిజోరంలో పోస్టుల సంఖ్య: 05
- నాగాలాండ్‌లో పోస్టుల సంఖ్య: 05
- సిక్కింలో పోస్టుల సంఖ్య: 05
- త్రిపురలో పోస్టుల సంఖ్య: 22
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కనీసం ఏడాది బ్యాంకింగ్ రంగంలె అనుభవం ఉండాలి.అభ్యర్థులు సంబంధిత రాష్ట్ర స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయో పరిమితి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్ధులకు మూడేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్లైన్ విధానంలో నవంబర్ 23, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్థులు రూ.1180, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్ధులు రూ.59 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్థానిక భాషా పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్షడిసెంబర్ 2025 లేదా జనవరి 2026లో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానం ఇలా..
మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలకు ఈ పరీక్ష ఉంటుంది. రీజనింగ్ విభాగం నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగం నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగం నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, ఇంగ్లిష్ విభాగం నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులు, జనరల్ అవేర్నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు 50 మార్కుల చొప్పున కేటాయిస్తారు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు.
































