మఖానా ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం! ముట్టుకుంటే మటాషే..

గతంలో పూజలు, పండుగలు, ఉపవాస దినాలలో ఎక్కువగా దీనిని తీసుకుంటూ ఉంటారు. కానీ నేటి కాలంలో ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ మఖానాను తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. ‘ఫాక్స్ నట్స్’ , ‘లోటస్ సీడ్స్’ అని పిలువబడే ఈ ఆహారాన్ని సూపర్‌ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో..

మఖానా గురించి తెలియని వారుండరు. గతంలో పూజలు, పండుగలు, ఉపవాస దినాలలో ఎక్కువగా దీనిని తీసుకుంటూ ఉంటారు. కానీ నేటి కాలంలో ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ మఖానాను తమ ఆహారంలో చేర్చుకుంటున్నారు. ‘ఫాక్స్ నట్స్’ , ‘లోటస్ సీడ్స్’ అని పిలువబడే ఈ ఆహారాన్ని సూపర్‌ఫుడ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మఖానాతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొందరికి ఇది తీవ్ర హాని తలపెడుతుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..


మఖానా ఎవరికి డేంజరంటే..

కిడ్నీ రోగులు

మఖానాలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారి శరీరంలో పొటాషియంను సరిగ్గా తొలగించలేవు. ఫలితంగా హృదయ స్పందన సక్రమంగా ఉండక బలహీనంగా మారుతుంది. ఇది ఇతర తీవ్రమైన సమస్యలకు కూడా దారితీస్తుంది.

డయాబెటిక్ రోగులు

మఖానాను తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారంగా పరిగణిస్తున్నప్పటికీ.. దీన్ని పెద్ద పరిమాణంలో తినడం వల్ల రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. కాబట్టి, డయాబెటిక్ రోగులు దీనిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం ఉత్తమం.

జీర్ణ సమస్యలు

మఖానాలోని ఫైబర్ చాలా మంది ఓ వరం భావించినప్పటికీ, వీటిని ఎక్కువగా తినడం వల్ల అపానవాయువు, గ్యాస్, మలబద్ధకం సమస్యలు పెరుగుతాయి. బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

అలెర్జీ

కొంతమంది శరీరాలు అలెర్జీ ప్రతిచర్యను కలిగి ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు మఖానాతో తయారు చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. దీని వల్ల దురద, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అందువల్ల వీరు వీటిని తినడం మానేయాలి.

బరువును నియంత్రణ

మఖానాను వేయించేటప్పుడు దానికి నెయ్యి, నూనె లేదా ఇతర సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. ఇందులోని అదనపు కొవ్వు, కేలరీలు బరువు పెరగడానికి దారితీస్తాయి. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు మఖానా తినకపోవడమే మంచిది.

మఖానా నిస్సందేహంగా పోషకమైన ఆహారం. కానీ అన్ని ఆహారాల మాదిరిగానే దీనికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అందువల్ల ఎవరికైనా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మఖానాను తినే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.