ఒక్క చుక్క కూడా పెద్ద ముప్పే.. మందు మీ మెదడును ఎలా దెబ్బతీస్తుందో తెలిస్తే షాకే..

ప్పుడప్పుడు స్నేహితులతో కలిసి ఒక గ్లాసు వైన్ లేదా వీకెండ్ డ్రింక్ ఆస్వాదించడం సాధారణం. ప్రపంచవ్యాప్తంగా 84శాతం కంటే ఎక్కువ మంది పెద్దలు మద్యం సేవిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.


అయితే ఈ మితమైన అలవాటు కూడా మీ మెదడుపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. క్రమం తప్పకుండా లేదా అధికంగా మద్యం సేవించడం వల్ల ఈ ప్రభావాలు మరింత తీవ్రంగా మారతాయి. భువనేశ్వర్‌లోని మణిపాల్ హాస్పిటల్‌కు చెందిన కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అమ్లాన్ తపన్ మోహపాత్ర ఆల్కహాల్ మెదడుపై చూపే ప్రభావాల గురించి వివరంగా వివరించారు.

నాడీ వ్యవస్థపై ఆల్కహాల్ ప్రభావం

డాక్టర్ మోహపాత్ర ప్రకారం.. ఆల్కహాల్ మొత్తం నాడీ వ్యవస్థను, మెదడు, వెన్నుపాము, పరిధీయ నరాలతో సహా ప్రభావితం చేస్తుంది. ఇది మెదడు కార్యకలాపాలను నెమ్మదిస్తుంది, విశ్రాంతి లేదా తేలికపాటి మగతకు కారణమవుతుంది. మద్యం నాడీ కణాలను దెబ్బతీస్తుంది. వాటి మధ్య సంభాషణను అడ్డుకుంటుంది. కాలక్రమేణా.. ఇది జ్ఞాపకశక్తి, సమన్వయం, మానసిక స్థితి, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది.

తీవ్రమైన సమస్యలు.. అకస్మాత్తుగా వచ్చే ముప్పు

ఆల్కహాల్ సంబంధిత మెదడు సమస్యలను న్యూరాలజిస్టులు రెండు ప్రధాన గ్రూపులుగా వర్గీకరిస్తారు. అవే తీవ్రమైన, దీర్ఘకాలిక పరిస్థితులు. అధికంగా మద్యం సేవించి.. సడెన్‌గా మానేసినప్పుడు తీవ్రమైన ప్రభావాలు కనిపిస్తాయి.

వెర్నికేస్ ఎన్సెఫలోపతి: విటమిన్ B1 లోపం వల్ల వెర్నికేస్ ఎన్సెఫలోపతి వస్తుంది. దీనివల్ల గందరగోళం, బ్యాలెన్స్ కోల్పోవడం జరుగుతుంది. దీనికి చికిత్స చేయకపోతే, కోర్సాకోఫ్ సైకోసిస్ వస్తుంది. ఇందులో మతిమరుపు, గందరగోళం, వ్యక్తిత్వ మార్పులు శాశ్వతంగా ఉంటాయి.

మూర్ఛ: బాగా తాగి.. సడెన్‌గా మానేసినప్పుడు మూర్ఛ రావడం జరుగుతుంది.

దీర్ఘకాలిక నష్టం.. నరాలు, కండరాలకు శాశ్వత హాని

నిరంతర మద్యపానం వల్ల అనేక దీర్ఘకాలిక నాడీ సంబంధిత రుగ్మతలు అభివృద్ధి చెందవచ్చని డాక్టర్ మోహపాత్ర హెచ్చరించారు.

నరాలు దెబ్బతినడం (న్యూరోపతి): చేతులు, కాళ్లలోని నరాలు దెబ్బతింటాయి. దీంతో మంట, తిమ్మిరి, బలహీనత వస్తాయి. నడవడానికి, చిన్న వస్తువులు పట్టుకోవడానికి కష్టమవుతుంది.

కండరాల బలహీనత (మయోపతి): కండరాలు దెబ్బతినడం వల్ల బలం కోల్పోతారు.

బ్యాలెన్స్ కోల్పోవడం: మెదడులోని ఒక భాగం దెబ్బతిని, నడవడంలో బ్యాలెన్స్ దెబ్బతింటుంది, తరచుగా కింద పడతారు.

పెద్ద ప్రమాదాలు: ఎక్కువ కాలం తాగితే పక్షవాతం (స్ట్రోక్), మతిమరుపు వచ్చే ప్రమాదం చాలా పెరుగుతుంది.

సురక్షితమైన పరిమాణం లేదు..

డాక్టర్ మోహపాత్ర చెప్పిన ముఖ్య విషయం ఏమిటంటే.. మెదడు ఆరోగ్యానికి నిజంగా సురక్షితమైన పరిమాణం అంటూ ఏదీ లేదు. మీరు మితంగా తాగినా కూడా అది మీ నిద్ర, ఏకాగ్రత, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని దెబ్బతీస్తుంది. కాలక్రమేణా.. ఈ చిన్న చిన్న ప్రభావాలు పేరుకుపోయి మెదడును తీవ్రంగా పాడు చేస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.