ఏపీ ప్రజలకు తీపికబురు.. భారీగా తగ్గనున్న కరెంట్ ఛార్జీలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు కూటమి సర్కార్ మరో తీపికబురు చెప్పింది. ఈ నెల నుంచి కరెంట్ ఛార్జీలను తగ్గించబోతున్నట్లుగా ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravi Kumar) వెల్లడించారు.


ఇవాళ అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధిలోని చౌడువాడ, కింతలి గ్రామాల్లో కొత్తగా నిర్మించిన సబ్ స్టేషన్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఎఫ్‌పీపీ (FPP) ఛార్జీల రూపంలో యూనిట్‌కు 40 పైసలు అధికంగా వసూలు చేసిందని అన్నారు. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆ ఛార్జీని తాము 13 పైసలకు తగ్గించబోతున్నామని.. ఈ పరిణామంతో విద్యుత్ వినియోగదారులకు ఆర్థికంగా కాస్త ఉపశమనం కలుగనందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో రూ.250 కోట్ల వ్యయంతో 69 కొత్త సబ్ స్టేషన్లను నిర్మిస్తున్నామని తెలిపారు. 20 వేల ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఉచితంగా సౌర విద్యుత్తు యూనిట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ హామీ ఇచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.