రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరులో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటక్షన్ యూనిట్ అండ్ వన్ స్టాఫ్ సెంటర్, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ, శిశుగృహ, చిల్డ్రన హోమ్స్‌లలో.. కాంట్రక్ట్, ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగా భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గిద్దలూరులో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటక్షన్ యూనిట్ అండ్ వన్ స్టాఫ్ సెంటర్, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ, శిశుగృహ, చిల్డ్రన హోమ్స్‌లలో.. కాంట్రక్ట్, ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగా భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 16 సోషల్ వర్కర్, పార్ట్ టైం డాక్టర్, స్టాఫ్ ఆయాలు, సైకో సోషల్ కౌన్సలర్, కేస్ వర్కర్, పారా మెడికల్ పర్సనల్, మల్టిపర్పస్ హెల్పర్ వంటి తదితర పోస్టులను భర్తీ చేయనుంది. ఆర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
పోస్టుల వివరాలు ఇలా..
- సోషల్ వర్కర్ పోస్టుల సంఖ్య: 1
- పార్ట్ టైం డాక్టర్ పోస్టుల సంఖ్య: 1
- స్టాఫ్ ఆయాలు పోస్టుల సంఖ్య: 2
- సైకో సోషల్ కౌన్సలర్ పోస్టుల సంఖ్య: 1
- కేస్ వర్కర్ పోస్టుల సంఖ్య: 1
- పారా మెడికల్ పర్సనల్ పోస్టుల సంఖ్య: 1
- మల్టిపర్పస్ హెల్పర్ పోస్టుల సంఖ్య: 1
- స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ పోస్టుల సంఖ్య: 2
- ఎడ్యుకేటర్ పోస్టుల సంఖ్య: 2
- పి.టి అండ్ యోగా టీచర్ పోస్టుల సంఖ్య: 2
- హౌజ్ కీపర్ పోస్టుల సంఖ్య: 1
- ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ పోస్టుల సంఖ్య: 1
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి పదో తరగతి, బీఎస్‌డబ్ల్యూ, ఎంఎస్‌డబ్ల్యూ, డిప్లొమా, బీకాం, బీఎడ్, బీఎస్సీ, ఎంబీబీఎస్, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్లో సూచించిన విధంగా సంబంధిత పని అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి పోస్టులను అనుసరించి 18 నుంచి 47 ఏళ్లకు మించకూడదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా వాసులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 8, 2025వ తేదీలోపు ఈ కింద అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది.
ఎంపికైన వారికి ఈ కింది విధంగా జీతాలు ఇస్తారు..
- సోషల్ వర్కర్ పోస్టులకు నెలకు: రూ.18,536
- పార్ట్ టైం డాక్టర్ పోస్టులకు నెలకు: రూ.9,930
- స్టాఫ్ ఆయా, హౌజ్ కీపర్ పోస్టులకు నెలకు: రూ.7,944
- సైకో సోషల్ కౌన్సలర్ పోస్టులకు నెలకు: రూ.20,000
- పారా మెడికల్ పర్సనల్ పోస్టులకు నెలకు: రూ.19,000
- మల్టిపర్పస్ హెల్పర్ పోస్టులకు నెలకు: రూ.13,000
- స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ పోస్టులకు నెలకు: రూ.18,536
- ఎడ్యుకేటర్, పి.టి అండ్ యోగా టీచర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ పోస్టులకు నెలకు: రూ.10,000
అడ్రస్:
జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి, సాధికారిత అధికారి కార్యాలయం, రాంనగర్ 3వ లైన్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
































